సీఎం చంద్రబాబు కృషి వల్లే సమన్వయం: మాధవ్ ప్రశంస
Advertisement
- 'చెప్పాం.. చేస్తున్నాం' నినాదంతో స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామన్న మాధవ్
- కూటమిలో కిందిస్థాయి వరకు సీట్ల సర్దుబాటు పూర్తయిందని వెల్లడి
- ప్రత్యర్థుల ఆశలకు అవకాశం ఇవ్వలేదని వ్యాఖ్య
Advertisement
"చెప్పాం.. చేస్తున్నాం" అనే నినాదంతో రాష్ట్రంలో మంచి వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పాలక కూటమిలోని మూడు పార్టీలు సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏకతాటిపైకి వచ్చాయని, కింది స్థాయిలోనూ సమన్వయంతో సీట్ల సర్దుబాటు చేసుకుని ఎన్నికల బరిలో నిలిచామని స్పష్టం చేశారు.
కూటమిలో బీటలు వస్తాయనే ప్రత్యర్థుల ఆశలకు తాము ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని మాధవ్ అన్నారు. ఈ ఐక్యతతోనే సూపర్ ఎల్‌నినో వంటి సవాళ్లను అధిగమించి సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలనే లక్ష్యంతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని, ఇందుకు ప్రజలందరి ఆశీస్సులు కావాలని కోరారు.
ఈ స్థానిక ఎన్నికలు ఎంతో కీలకమైనవని మాధవ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం చాలా గొప్పగా ఉందని కొనియాడారు. సార్వత్రిక ఎన్నికల్లో చూపిన ఐక్యతతోనే స్థానిక సమరంలోనూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.