స్థానిక ఎన్నికలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. రెబల్స్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ
Advertisement
- పార్టీ బీఫామ్ ఇచ్చినవారే అధికారిక అభ్యర్థులన్న పవన్ కల్యాణ్
- మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచన
- కూటమి స్ఫూర్తితో అధికారిక అభ్యర్థుల గెలుపుకు పనిచేయాలని పిలుపు
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా పార్టీ అధికారికంగా బీఫామ్ జారీ చేసినవారే కూటమి అభ్యర్థులని, నామినేషన్లు వేసిన ఇతరులు వాటిని ఉపసంహరించుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కూటమి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.
సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఒక సవాల్ లాంటిదని, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో దీనిని విజయవంతంగా పూర్తి చేశామని పవన్ తెలిపారు. అందరం కలిసి కూర్చుని చర్చించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేశామన్నారు. కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి భవిష్యత్తులో తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రదర్శించిన ఐక్యతను మరోసారి స్థానిక ఎన్నికల్లోనూ చూపాలని నేతలకు పిలుపునిచ్చారు.
సీట్ల సర్దుబాటు చర్చల సమయంలోనే ఆర్నబ్ తుపాన్ వచ్చిందని, అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సీఎం చంద్రబాబు తుపాన్‌పై సమీక్షలు నిర్వహించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని పవన్ గుర్తుచేశారు. సంక్షోభ సమయంలో ఆయన పనితీరు అందరికీ ఆదర్శమన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంలో ప్రభుత్వం ఛాలెంజింగ్‌గా పనిచేస్తోందని, దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయని చెప్పారు. అడవితల్లి బాట కింద రూ.3,458 కోట్లతో 3,638 కిలోమీటర్ల రోడ్లు నిర్మించామని, పంచాయతీరాజ్ శాఖలో రూ.1.5 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు.