ప్రజా ప్రయోజన ప్రచారానికి డబ్బు తీసుకుంటారా?.. బాలీవుడ్ సెలబ్రిటీలకు బాంబే హైకోర్టు చురకలు
Advertisement
- ప్రజా ప్రచారాలకు సెలబ్రిటీలకు డబ్బివ్వడంపై హైకోర్టు ఆగ్రహం
- సామాజిక బాధ్యతగా ఉచితంగా ప్రచారం చేయాలని సూచన
- భారీ ఫీజులతో ప్రజాధనం వృథా చేయవద్దని స్పష్టం
- చెల్లింపులు ఆశించని మరాఠీ నటులను ఆశ్రయించాలని సలహా
Advertisement
ప్రజా ప్రయోజన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బాలీవుడ్ ప్రముఖులు భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడంపై బాంబే హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సామాజిక బాధ్యతగా భావించి ఇటువంటి ప్రచార కార్యక్రమాల్లో ఉచితంగా పాల్గొనాలని, లేనిపక్షంలో వారిని సంప్రదించాల్సిన అవసరమే లేదని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది.
ముంబైలో వాయు, ధ్వని కాలుష్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. "ప్రజలకు మేలు చేకూర్చే కార్యక్రమాలకు సైతం సెలబ్రిటీలు నగదు ఎందుకు డిమాండ్ చేయాలి? ప్రజాధనాన్ని ఇటువంటి పారితోషికాల కోసం వృథా చేయకూడదు" అని కోర్టు స్పష్టం చేసింది. నగరం నుంచి ఎంతో లబ్ధి పొందుతున్న నటీనటులు, సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉందని ఈ సందర్భంగా హితవు పలికింది.
ఉచితంగా సేవలందించేందుకు ఇష్టపడని బాలీవుడ్ తారల కంటే, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే మరాఠీ నటులను సంప్రదించడం ఉత్తమమని కోర్టు సూచించింది. ముంబై పోలీసుల 'ఉమంగ్' వంటి కార్యక్రమాలకు సమయం కేటాయించే తారలు, ప్రజా సంక్షేమం కోసం ఒక 15 నిమిషాల సమయాన్ని ఉచితంగా కేటాయించలేరా? అని న్యాయస్థానం నిలదీసింది. కాలుష్యం వంటి అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అందుకోసం ప్రభుత్వ ఖజానాపై భారం మోపడం సరికాదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది.