'అర్ణబ్' తుపానుపై వదంతులు నమ్మొద్దు.. అప్రమత్తతో గండం నుంచి బయటపడదాం: అచ్చెన్నాయుడు

Andhra
Advertisement
  • బంగాళాఖాతంలో 'అర్ణబ్' తుపాను
  • రేపటికి అతి తీవ్ర తుపానుగా మారనున్న వైనం
  • అక్టోబర్ 28న బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఏపీ, దక్షిణ ఒడిశా తీరాలకు రెడ్ అలర్ట్ జారీ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం రైతులు, మత్స్యకారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచన
  • అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలన్న మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు తుపానుగా మారింది. ఈ తుపానుకు 'అర్ణబ్' అని నామకరణం చేశారు. 'అర్ణబ్' తుపాను ఏపీ దిశగా వస్తోందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. అనవసరమైన వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత వాతావరణ శాఖ (IMD), విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా యంత్రాంగం ఇచ్చే సూచనలను మాత్రమే పాటించాలని సోమవారం స్పష్టం చేశారు. ఈ విపత్కర సమయంలో ప్రజలందరూ సమన్వయంతో, ముందస్తు అప్రమత్తతతో వ్యవహరించి తుపాను గండం నుంచి సురక్షితంగా బయటపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు మంత్రి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సూచనలు జారీ చేశారు.

తీరం దాటేది అప్పుడే.. రెడ్ అలర్ట్ జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 'అర్ణబ్' తుపానుగా మారి వేగంగా బలపడుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది అక్టోబర్ 26, సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా, మరుసటి రోజు అక్టోబర్ 27న అతి తీవ్ర తుపానుగా మారనుందని తెలిపారు. అక్టోబర్ 28, బుధవారం ఉదయం బాపట్ల-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

తీరం దాటే సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్లు, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27, 28 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.

ప్రాణరక్షణకే తొలి ప్రాధాన్యం
ఈ విపత్తు సమయంలో ప్రజల ప్రాణరక్షణకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. తీర, లోతట్టు ప్రాంతాల ప్రజలు తక్షణమే అధికారులు సూచించిన సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరూ అత్యవసర మందులు, తాగునీరు, ఆహార పొట్లాలు, టార్చ్‌లైట్లు, బ్యాటరీలు, ముఖ్యమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. 

బలహీనమైన భవనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులకు దూరంగా ఉండాలని, వర్షాలు, పిడుగుల సమయంలో బయటకు రావద్దని హెచ్చరించారు. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లినవారు వెంటనే తీరానికి చేరుకోవాలని ఆదేశించారు.

రైతన్నలకు ప్రత్యేక సూచనలు
రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. కోతకు సిద్ధంగా ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ వంటి పంటలను వాతావరణం అనుకూలించగానే కోసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ధాన్యం రాశులు, ఇతర ఉత్పత్తులను టార్పాలిన్లతో కప్పి భద్రపరచుకోవాలన్నారు. 

అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటలకు ఊతంగా కర్రలు ఏర్పాటు చేసుకోవాలని, పొలాల్లో నీరు నిలిచిపోకుండా మురుగు కాలువలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలను ఎత్తైన, సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలన్నారు. అయితే, పంటలను కాపాడే ప్రయత్నంలో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టవద్దని ఆయన గట్టిగా కోరారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారుల సలహాలను పాటిస్తూ ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
Advertisement

సంబంధిత వార్తలు

Cyclone ArnabAtchannaiduAndhra Pradesh WeatherIMD Red AlertBay of BengalCyclone Landfall

More Telugu News

'ఖలీఫా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

26 Oct, 18:02

జనసేనకు మద్దతుగా హైపర్ ఆది ప్రచారం

26 Oct, 18:01

విరాట్‌, రోహిత్‌ల తర్వాతి సూపర్‌స్టార్‌ వచ్చేశాడు.. యువ ఆటగాడిపై క్లూసెనర్‌ ప్రశంసలు!

26 Oct, 17:22

ఇలాగైతే ప్రజల మద్దతు పొందలేరు.. ఆ పార్టీ దుకాణం సర్దేసుకోవడం మంచిది: మంత్రి అనగాని

26 Oct, 17:19

విశాఖ స్థానిక ఎన్నికలు: 'సేల్' వర్సెస్ 'సేవ్'.. వైసీపీ కొత్త నినాదం

26 Oct, 17:06

ఏఐ చాట్‌బాట్‌లో ఈ 5 విషయాలు అస్సలు టైప్‌ చేయొద్దు.. మీ వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండాలంటే!

26 Oct, 17:04

అర్ణబ్ తుపాను: ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదు.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

26 Oct, 17:00

ఎస్సై ప్రియాంకపై గుంటూరు ఎస్పీకి విడదల రజని ఫిర్యాదు

26 Oct, 16:51

జగపతిబాబు టాక్ షోలో నారా లోకేశ్ సందడి.. బాలయ్యకు ఎవరంటే భయం?

26 Oct, 16:48

హైదరాబాద్‌లో అమిత్‌ షా పాదయాత్ర.. కాంగ్రెస్‌ ర్యాలీకి మరుసటి రోజే బీజేపీ కౌంటర్‌!

26 Oct, 16:47

స్టాక్‌ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు.. సెన్సెక్స్‌ 482 పాయింట్లు జంప్‌

26 Oct, 16:28

ఏబీ వెంకటేశ్వరరావుపై వ్యక్తిగత విమర్శలు చేయను: వంగవీటి రాధా

26 Oct, 16:25

మా కాపురంలోకి మూడో వ్యక్తి.. నా భార్యను ఎవరో రెచ్చగొడుతున్నారు: గోవిందా

26 Oct, 16:19

‘100 సార్లేంటి.. వెయ్యిసార్లైనా పెళ్లి చేసుకోమని అడుగుతా!’.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం

26 Oct, 16:14
..More Telugu News