పురపోరులో కూటమి ప్రభంజనం.. 17 మున్సిపాలిటీలు ఏకగ్రీవం
Advertisement
- 726 వార్డులు, డివిజన్లు కూటమికి ఏకగ్రీవం
- జగన్ సొంత జిల్లా కడపలోనూ కూటమి విజయకేతనం
- పులివెందులలోనూ పలు వార్డులు ఏకగ్రీవం
- పలుచోట్ల అభ్యర్థులను నిలబెట్టలేకపోయిన వైసీపీ
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయఢంకా మోగిస్తోంది. పోలింగ్‌కు ముందే రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. ఈ 17 ఛైర్‌పర్సన్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 15, జనసేన 1, బీజేపీ 1 చొప్పున విజయం సాధించాయి.
వార్డులు, డివిజన్ల వారీగా పరిశీలిస్తే కూటమి అభ్యర్థులు గణనీయ సంఖ్యలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కూటమి తరఫున మొత్తం 726 స్థానాలు (టీడీపీ 660, జనసేన 38, బీజేపీ 28) ఏకగ్రీవం కాగా, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాల్లోనే ఏకగ్రీవ విజయాలను నమోదు చేసింది. సీపీఐ ఒక స్థానంలో, స్వతంత్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వార్డుల్లో 21.08 శాతం, డివిజన్లలో 12.58 శాతం స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఈ ఏకగ్రీవ ఫలితాల్లో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కూటమి సాధించిన విజయాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కడప జిల్లాలో 8 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతుండగా, అందులో 6 చోట్ల ఛైర్‌పర్సన్ పదవులను కూటమి ఏకగ్రీవంగా దక్కించుకుంది. కడప కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు గాను 50 స్థానాలను, పులివెందుల మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 20 వార్డులను కూటమి ఏకగ్రీవంగా గెలుచుకుంది. వీటితో పాటు పుంగనూరు, నగరి, గురజాల నియోజకవర్గాల్లోని మూడు పట్టణ స్థానిక సంస్థల్లోనూ కూటమి జెండా ఎగరేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, పలుచోట్ల స్థానిక విభేదాలు, ఇతర సాంకేతిక కారణాల వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పోటీకి నిలబెట్టడంలో విఫలమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.