జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల తుది జాబితా
Advertisement
- పరిషత్ ఎన్నికల నామినేషన్ల తుది జాబితాను విడుదల చేసిన ఎస్‌ఈసీ
- 9,829 ఎంపీటీసీ స్థానాలకు 46,045 నామినేషన్లు ఖరారు
- 659 జడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లకు ఆమోదం
- నామినేషన్ల సంఖ్యలో టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీ
- తిరుపతి జిల్లాలో అత్యధికంగా జడ్పీటీసీ నామినేషన్ల దాఖలు
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న పరిషత్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల పరిశీలన అనంతరం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదివారం తుది జాబితాను ప్రకటించింది. నామినేషన్ల తిరస్కరణ తర్వాత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు అధికారికంగా వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 46,045 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పార్టీల వారీగా పరిశీలిస్తే.. టీడీపీ నుంచి 19,760, వైసీపీ నుంచి 17,726, జనసేన నుంచి 4,330, బీజేపీ నుంచి 1,049 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరితో పాటు మరో 2,012 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 51,902 నామినేషన్లు దాఖలు కాగా, వివిధ కారణాలతో అధికారులు 5,857 నామినేషన్లను తిరస్కరించారు.
మరోవైపు, 659 జడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లు ఆమోదం పొందాయి. వీటిలో టీడీపీ తరఫున 1,693, వైసీపీ తరఫున 1,445, జనసేన నుంచి 587, బీజేపీ నుంచి 227 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మరో 227 మంది స్వతంత్ర అభ్యర్థులు సైతం ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 5,724 నామినేషన్లు రాగా, వాటిలో 954 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. జిల్లాల వారీగా గణాంకాలను పరిశీలిస్తే.. తిరుపతి జిల్లాలో 35 జడ్పీటీసీ స్థానాలకు అత్యధికంగా 280 నామినేషన్లు ఆమోదం పొందాయి. కడప జిల్లాలో 39 స్థానాలకు 215, విశాఖ జిల్లాలో 4 స్థానాలకు 46 నామినేషన్లు ఖరారయ్యాయి.