శ్రీవారి దర్శనానంతరం ప్రమాదం.. తమిళనాడు భక్తులకు గాయాలు

26-10-2026 Mon 06:19 | Andhra
Advertisement
  • తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు ప్రమాదం
  • అదుపుతప్పి కొండను ఢీకొట్టడంతో ఘటన
  • బాధితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తింపు
  • క్షతగాత్రులను చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలింపు
Advertisement
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఆదివారం ప్రమాదం సంభవించింది. భక్తులతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి కొండను ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. బాధితులను తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

తమిళనాడు నుంచి వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని కారులో తిరుపతికి తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో మొదటి ఘాట్ రోడ్డులోని మాల్వాడి గుండం సమీపంలోకి రాగానే, కారు అదుపుతప్పి వేగంగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు భక్తులకు గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, టీటీడీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Advertisement
Tirumala Ghat RoadTirumala road accidentTamil Nadu pilgrims injuredRuia Hospital TirupatiSrivari Darshan accidentTirupati news today

More Telugu News

ఉద్యోగులకు దీపావళి కానుక: క్యాష్‌, వోచర్, గిఫ్ట్ కార్డ్.. ఏది ఎక్కువ ప్రయోజనకరం?

26-10-2026 Mon 08:57

ఏపీపై 'ఆర్నబ్' పడగ: కోస్తా తీరానికి 'అతి తీవ్ర' తుపాను ముప్పు!

26-10-2026 Mon 08:40

టైగర్ ష్రాఫ్ దాడి కేసులో సంచలనం.. బిష్ణోయ్ గ్యాంగ్ అసలు టార్గెట్ ఆమిర్ ఖాన్!

26-10-2026 Mon 08:35

మేకను దహనం చేసి ఏఐతో తన శవంగా నమ్మించి..: యూపీ కేటుగాడి 'డెత్ డ్రామా' గుట్టురట్టు!

26-10-2026 Mon 08:25

టీ20 క్రికెట్‌లో టీమిండియా అరుదైన ఘ‌న‌త‌.. తొలి జట్టుగా ప్రపంచ రికార్డు!

26-10-2026 Mon 08:17

చిలకలూరిపేటలో వైసీపీకి భారీ షాక్... టీడీపీలో చేరిన ఛైర్‌పర్సన్ అభ్యర్థి

26-10-2026 Mon 07:56

పురపోరులో కూటమి ప్రభంజనం.. 17 మున్సిపాలిటీలు ఏకగ్రీవం

26-10-2026 Mon 07:54

లూలా చారిత్రాత్మక విజయం: బ్రెజిల్ అధ్యక్షుడిగా నాలుగోసారి ఘన విజయం

26-10-2026 Mon 07:51

మెర్సిడెస్ కారుతో జడ్జి మైనర్ కొడుకు బీభత్సం: స్కూటరిస్ట్ మృతి.. కేసును నీరుగార్చే యత్నంపై ఆరోపణలు!

26-10-2026 Mon 07:17

చెప్పాం.. చేస్తున్నాం: ‘బెల్’ ప్రాజెక్ట్‌పై మంత్రి నారా లోకేశ్

26-10-2026 Mon 07:00

నా మాటల్లో సగమే విన్నారు: ఖర్గే వ్యాఖ్యల దుమారంపై సభికుడి వివరణ

26-10-2026 Mon 06:48

సన్న బియ్యం సరఫరాలో మోసం.. 14 మంది రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసిన సీఐడీ

26-10-2026 Mon 06:25

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల తుది జాబితా

26-10-2026 Mon 06:21

రజనీకాంత్ 'ధర్మన్'లో నయనతార.. ఐదోసారి జంటగా బ్లాక్‌బస్టర్ జోడీ!

25-10-2026 Sun 23:11
..more