నగరి ఏకగ్రీవంపై జిల్లా కలెక్టర్‌కు రోజా ఫిర్యాదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నగరి ఏకగ్రీవంపై జిల్లా కలెక్టర్‌కు రోజా ఫిర్యాదు

RK Roja files complaint with District Collector over Nagari unanimous election
  • అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి, సస్పెండ్ చేయాలని రోజా డిమాండ్
  • ఏకగ్రీవాన్ని రద్దు చేసి, తిరిగి ఎన్నికలు నిర్వహించాలని వినతి
  • వైసీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణపై తీవ్ర ఆగ్రహం
నగరి మున్సిపల్ ఛైర్మన్ పదవి ఏకగ్రీవం కావడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై ఆమె జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సుమిత్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నగరిలో ఎన్నికల ప్రక్రియను అడ్డుకున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... నగరి మున్సిపాలిటీ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ అధికారిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి, వారిని సస్పెండ్ చేయాలని కోరారు. వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి బాలకృష్ణన్ హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ కాపీని ఆమె కలెక్టర్‌కు అందజేశారు. ఫారం-4లో తమ అభ్యర్థి పేరును చేర్చి, నగరి మున్సిపాలిటీకి నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

నగరిలో వైసీపీ నుంచి వచ్చిన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంతో బరిలో మిగిలిన టీడీపీ ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. 
Advertisement
RK Roja
Nagari Municipal Election
District Collector Sumit Kumar
YSRCP
Nagari Municipality
Andhra Pradesh Politics

More Telugu News