కాక్రోచ్ జనతా పార్టీ ప్రశ్నలు సరైనవే: అన్నామలై సంచలన వ్యాఖ్యలు
- నిరసనకారుల అరెస్టు విషయంలో ఢిల్లీ పోలీసుల తీరుపై అన్నామలై విమర్శలు
- అరెస్టులతో సీజేపీ నేతలు మరింత బలపడతారని వ్యాఖ్య
- భారత్ అన్ని మతాల వారిది అన్న మోహన్ భగవత్ మాటలను స్వాగతించిన అన్నామలై
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, 'వుయ్ ది లీడర్స్' వ్యవస్థాపకుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) అడుగుతున్న ప్రశ్నలను తాను సమర్థిస్తున్నానని, అయితే వారి నిరసన విధానాలతో ఏకీభవించనని స్పష్టం చేశారు. చెన్నైలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"సీజేపీ నిరసన తెలిపే విధానాలతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ వారు లేవనెత్తుతున్న ప్రశ్నలకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది" అని అన్నామలై అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసుల వైఖరిపై అన్నామలై మండిపడ్డారు. "నిరసనకారులను అరెస్ట్ చేసి, ఎక్కువ కాలం జైల్లో ఉంచడం వల్ల సీజేపీ నేతలు మరింత బలపడతారు. ఢిల్లీ పోలీసులు ఈ వ్యవహారంలో తప్పుగా ప్రవర్తిస్తున్నారు" అని విమర్శించారు. 'భారతదేశం అన్ని మతాల ప్రజలది. ముస్లింలకు, ఇతరులకు ఇక్కడ స్థానం లేదని ఏ హిందువూ అనకూడదు' అంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కూడా అన్నామలై స్వాగతించారు.