సొంతూరులో రేవంత్ రెడ్డి.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సొంతూరులో రేవంత్ రెడ్డి.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

Revanth Reddy performs special prayers with family in native village
  • సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం దసరా వేడుకలు
  • హెలికాప్టర్ లో చేరుకున్న రేవంత్ కు ఘన స్వాగతం
  • మైసమ్మ ఆలయం వద్ద జమ్మి చెట్టు పూజలో పాల్గొననున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా పండుగను తన సొంత గ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా, వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి విచ్చేసిన ఆయన, స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హెలికాప్టర్‌లో గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సాయంత్రం ఆయన గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం కానున్నారు. మైసమ్మ ఆలయం వద్ద జరిగే జమ్మి చెట్టు పూజలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.
Advertisement
Revanth Reddy
Kondareddypally
Nagarkurnool
Dasara celebrations
Telangana CM
Anjaneya Swamy Temple

More Telugu News