పోతురాజుగా మంచు మనోజ్.. భారీ బడ్జెట్‌తో డివైన్ యాక్షన్ థ్రిల్లర్!
- పోతురాజు పాత్రలో కనిపించనున్న మంచు మనోజ్
- డివైన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న కొత్త చిత్రం
- ప్రేమకథా చిత్రం నిర్మాతల నుంచి మరో భారీ ప్రాజెక్ట్
- పూరి జగన్నాథ్ శిష్యుడు ఏ. శ్రీధర్ దర్శకత్వం
- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో కథ
విలక్షణ నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన పోతురాజు పాత్ర నేపథ్యంలో ఓ భారీ బడ్జెట్ డివైన్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆయన నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన RPA క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆర్.పి. అక్షిత్ రెడ్డి, ఆర్. సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన ఏ. శ్రీధర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
దర్శకుడు శ్రీధర్ ఈ సినిమా కోసం పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు చూడని సరికొత్త అవతార్‌లో మనోజ్‌ను ఈ చిత్రంలో చూపించనున్నారట. దైవిక అంశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు తెలంగాణ పండుగల వైభవాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
ఈ చిత్రానికి ఎం. శ్రీకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్. ఆయుష్ రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. RPA క్రియేషన్స్‌కు ఇది ప్రొడక్షన్ నెం. 4. సినిమా టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని నిర్మాతలు వెల్లడించారు.