చలికాలంలో గీజర్ వాడుతున్నారా? ఆన్ చేసే ముందు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి!
Advertisement
- గీజర్ ట్యాంకులో ఖనిజ లవణాల పేరుకుపోయే ఛాన్స్
- తుప్పు కనిపిస్తే ట్యాంకు, యానోడ్ రాడ్‌ను తనిఖీ చేయించాలని సూచన
- థర్మోస్టాట్, ప్రెజర్ వాల్వ్ సక్రమంగా పనిచేసుకునేలా చూడాలి
- వైరింగ్, ప్లగ్, ఎర్తింగ్‌ను ఎలక్ట్రీషియన్‌తో పరీక్షించాలని సలహా
- పైపుల లీకేజీలను సరిచేసి, నీరు ఉన్నప్పుడే గీజర్‌ను ఆన్ చేయాలని సూచన
Advertisement
చలికాలం మొదలవుతుండటంతో ఇళ్లలో గీజర్ల వాడకం పెరగనుంది. వేసవి కాలమంతా ఉపయోగించకుండా ఉంచిన గీజర్‌ను ఒక్కసారిగా ఆన్ చేయడం వల్ల విద్యుత్ సమస్యలు, నీటి లీకేజీలు, మరమ్మతుల ఖర్చులు ఎదురుకావచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకూ దారితీయొచ్చు. అందుకే గీజర్‌ను ఉపయోగించే ముందు కొన్ని కీలక అంశాలను పరిశీలించాలి. అవేంటంటే..
1. గీజర్‌లో పేరుకుపోయిన మురికిని తొలగించాలి
నీటిలోని ఖనిజ లవణాలు గీజర్ ట్యాంకులో, హీటింగ్ ఎలిమెంట్‌పై పేరుకుపోతాయి. దీంతో నీరు వేడెక్కడానికి ఎక్కువ సమయం పడుతుంది. విద్యుత్ వినియోగం పెరుగుతుంది. గీజర్ నుంచి అసాధారణ శబ్దాలు రావొచ్చు. నిపుణులతో సర్వీసింగ్ చేయించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.
2. తుప్పు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు
స్టోరేజ్ గీజర్లలో ట్యాంకుకు తుప్పు పట్టకుండా రక్షించేందుకు ప్రత్యేక యానోడ్ రాడ్ ఉంటుంది. కాలక్రమేణా అది అరిగిపోతుంది. వేడి నీరు తుప్పు రంగులో వస్తున్నా, ట్యాంకులో తుప్పు కనిపించినా వెంటనే నిపుణుడితో తనిఖీ చేయించాలి. అవసరమైతే యానోడ్ రాడ్‌ను మార్చాలి.
3. భద్రతా పరికరాలు పనిచేస్తున్నాయో చూడాలి
గీజర్‌లోని థర్మోస్టాట్ నీటి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ ట్యాంకులో ఒత్తిడి అధికమైనప్పుడు దాన్ని తగ్గిస్తుంది. ఈ పరికరాల్లో లోపాలుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే సాంకేతిక నిపుణుడితో వాటిని తనిఖీ చేయించాలి.
4. విద్యుత్ కనెక్షన్లపై ప్రత్యేక శ్రద్ధ
గీజర్ విద్యుత్‌తో పనిచేస్తుంది కాబట్టి వైరింగ్, ప్లగ్, స్విచ్, ఎర్తింగ్ సక్రమంగా ఉన్నాయో చూడాలి. వైర్లు దెబ్బతిన్నా, ప్లగ్ వద్ద కాలిన గుర్తులు కనిపించినా, కనెక్షన్లు వదులుగా ఉన్నా వెంటనే అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్‌తో మరమ్మతులు చేయించాలి. తడి చేతులతో స్విచ్‌లను తాకకూడదు.
5. పైపుల్లో లీకేజీలు ఉన్నాయేమో చూడాలి
గీజర్‌కు నీటిని అందించే పైపులు, వేడి నీరు బయటకు వచ్చే పైపుల వద్ద లీకేజీలు ఉన్నాయేమో పరిశీలించాలి. పైపులకు పగుళ్లు, జాయింట్ల వద్ద తుప్పు ఉంటే మార్చాలి. నీటి ప్రవాహం తగ్గినా, గోడల దగ్గర తేమ కనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు.
ఈ జాగ్రత్తలు మరవొద్దు!
గీజర్‌ను ఆన్ చేసే ముందు ట్యాంకులో తగినంత నీరు ఉందని నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా విద్యుత్ సంబంధిత లోపాలను మీరే సరిచేసే ప్రయత్నం చేయకండి. అనుమానం వచ్చినా, గీజర్ సరిగా పనిచేయకపోయినా నిపుణుల సాయం తీసుకోండి. ముందస్తు తనిఖీలతో విద్యుత్ ఆదా చేయడమే కాకుండా, చలికాలంలో వేడి నీటిని సురక్షితంగా వాడుకోవచ్చు.