గురువు కోమటిరెడ్డి కోసం తలైనా ఇస్తా.. కానీ నీళ్ల కోసం యుద్ధమే: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గురువు కోమటిరెడ్డి కోసం తలైనా ఇస్తా.. కానీ నీళ్ల కోసం యుద్ధమే: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Anirudh Reddy says I will give my head for Guru Komatireddy but fight for water
  • ఏదుల నుంచి డిండికి నీటిని తరలించడాన్ని అంగీకరించేది లేదన్న అనిరుధ్ రెడ్డి
  • పాలమూరు నీళ్ల కోసం గురువునైనా ఎదిరిస్తానని వ్యాఖ్య
  • తనకు పాలమూరు ప్రయోజనాలే ముఖ్యమన్న అనిరుధ్
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ గురువైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోసం తన తలనైనా నరుక్కుంటానని... కానీ పాలమూరు ప్రాంత నీటి హక్కుల విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నీళ్ల కోసం అవసరమైతే గురువుతోనైనా యుద్ధం చేస్తానని, తన ప్రాంత ప్రయోజనాలే తనకు ముఖ్యమని తేల్చిచెప్పారు.
జడ్చర్లలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల మధ్య నీటి కేటాయింపుల వివాదంపై ఆయన తన వైఖరిని స్పష్టం చేశారు. ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని అన్నారు. ముందుగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పాలమూరుకు నీరందించాకే, దిండికి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు కేవలం 60 శాతమే పూర్తయ్యాయని అనిరుధ్ రెడ్డి ఆరోపించారు.

ఈ ప్రాజెక్టు పూర్తి కోసం జేఏసీ తలపెట్టిన జలదీక్షకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ప్రాజెక్టు సాధన కోసం పాలమూరు ఎమ్మెల్యేలంతా ఐక్యంగా పోరాడతామని చెప్పారు. అదే సమయంలో, ప్రతి అంశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనవసరంగా లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన హితవు పలికారు.
Advertisement
Anirudh Reddy
Komatireddy Venkat Reddy
Palamuru Rangareddy Lift Irrigation Scheme
Jadcherla MLA
Telangana water rights
Dindi Project

More Telugu News