వెంకీ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్పై సస్పెన్స్ వీడింది.. కానీ ఓ ట్విస్ట్!
- అక్టోబర్ 30నే సినిమా విడుదల అని నిర్మాత స్పష్టీకరణ
- వరుస వాయిదాలతో మళ్లీ డేట్ చెప్పడానికి భయమన్న నాగవంశీ
- ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వెంకటేశ్ చేతుల మీదుగా అధికారిక ప్రకటన
- ఈ నెల 21 లేదా 22న జరగనున్న భారీ ఈవెంట్ ఉంటుందని వెల్లడి
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' సినిమా విడుదలపై నెలకొన్న గందరగోళానికి ఎట్టకేలకు తెరపడింది. వరుస వాయిదాలతో సతమతమవుతున్న ఈ సినిమా విడుదల తేదీపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ పూర్తి స్పష్టతనిచ్చారు. అయితే, ఈసారి తనదైన శైలిలో చమత్కార వ్యాఖ్యలు జోడించి, ప్రకటన బాధ్యతను హీరో వెంకటేశ్కే అప్పగిస్తున్నట్లు తెలిపారు.
'జైలర్ 2' ప్రెస్ మీట్ సందర్భంగా 'ఆదర్శ కుటుంబం' విడుదల గురించి నాగవంశీ మాట్లాడారు. ముందుగా అనుకున్నట్లే సినిమా అక్టోబర్ 30న థియేటర్లలోకి వస్తుందని పరోక్షంగా ధ్రువీకరించారు. అయితే, వరుస వాయిదాల నేపథ్యంలో తనపై తానే సెటైర్లు వేసుకున్నారు.
"గతంలో సినిమా వాయిదా వేసినప్పుడు, అక్టోబర్ 30న వస్తున్నారా అని మీడియా మిత్రులు అడిగారు. మీరు ఊహించిన తేదీకే సినిమా రావడం ఖాయం. కానీ, ఈసారి ఆ తేదీని నేను అధికారికంగా ప్రకటించను. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేయడంతో, ఇప్పుడు మళ్లీ నేనే చెబితే జనాలు నమ్మరు, పైగా తంతారేమో" అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించడంతో ప్రెస్మీట్లో నవ్వులు పూశాయి.
ఈసారి ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా, పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు నాగవంశీ వివరించారు. "ప్రస్తుతం వెంకటేశ్ గారు ఊటీలో షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆయన హైదరాబాద్కు తిరిగి రాగానే, అక్టోబర్ 21 లేదా 22 తేదీల్లో భారీ స్థాయిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నాం. ఆ వేదికపై స్వయంగా వెంకటేశ్ గారే అభిమానుల సమక్షంలో విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు" అని స్పష్టం చేశారు.
గతంలో అక్టోబర్ 2, ఆ తర్వాత అక్టోబర్ 9 తేదీలకు వాయిదా పడిన ఈ సినిమా, ఈ నెలలో రావడం కష్టమనే ప్రచారం జరిగింది. తాజా ప్రకటనతో ఆ ఊహాగానాలకు ముగింపు పలికిన నాగవంశీ, ఈసారి హీరోతోనే నేరుగా ప్రకటన చేయించి సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు సిద్ధమయ్యారు. దీంతో వెంకటేశ్ అభిమానులు ట్రైలర్ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.