బీజేపీకి నచ్చని ఓట్లను తొలగిస్తున్నారు.. ‘సర్’ ప్రక్రియపై మహేశ్ కుమార్ గౌడ్
- ‘సర్’ ప్రక్రియలో లోపాలున్నాయన్న టీపీసీసీ చీఫ్
- ఓటర్ల జాబితా సవరణలో నిబంధనలు పాటించడం లేదని విమర్శలు
- వ్యక్తి మరణిస్తే ఓటు తొలగించాలని, వేరే ప్రాంతానికి మారితే బదిలీ చేయాలని సూచన
- ఎన్నికల సంఘం స్వతంత్రతపై ఆందోళన
- సీఈసీ ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారని ప్రశ్న
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్రర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో తీవ్ర లోపాలున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లేదని, తనకు కూడా నోటీసు వచ్చిందని వెల్లడించారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓటర్ల జాబితా సవరణలో నిబంధనలను సరిగా పాటించడం లేదని విమర్శించారు.
ఓ వ్యక్తి మరణిస్తే వారి ఓటును తొలగించాలని, వేరే ప్రాంతానికి మారితే ఓటును బదిలీ చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి నచ్చని ఓట్లను ఏకపక్షంగా తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికల సంఘం స్వతంత్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో చేసిన మార్పులపైనా మహేశ్ గౌడ్ ప్రశ్నలు లేవనెత్తారు. సీఈసీ ఎంపిక కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారని కేంద్రాన్ని ప్రశ్నించారు. స్వతంత్ర సంస్థల విధుల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.