సీఎం రేవంత్ ఆదేశాల అమలు.. విద్యుత్ శాఖలో ఉన్నతాధికారి సస్పెన్షన్
- యాదాద్రి థర్మల్ ప్లాంట్ చీఫ్ ఇంజినీర్ బి.సురేశ్ సస్పెన్షన్
- విధుల్లో నిర్లక్ష్యమే చర్యలకు కారణమని టీజీ జెన్కో ఉత్తర్వులు
- విద్యుదుత్పత్తి పెంపు పనుల్లో పర్యవేక్షణ లోపాలున్నట్లు ఆరోపణ
- విద్యుత్ కోతలపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర అసంతృప్తి
- ఉన్నతాధికారులపైనా చర్యలు తప్పవని సీఎం హెచ్చరిక
తెలంగాణలో విద్యుత్ కోతలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన గంటల వ్యవధిలోనే ప్రభుత్వం చర్యలకు దిగింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) స్టేజ్-1 చీఫ్ ఇంజినీర్ బి. సురేశ్ను సస్పెండ్ చేసింది. టీజీ జెన్కో సీఎండీ డాక్టర్ ఎస్.హరీశ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యుదుత్పత్తి పెంపునకు ప్రాధాన్య పనుల ప్రణాళిక, పర్యవేక్షణ, అమలులో ఆయన తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది.
బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో విద్యుత్ కోతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నైనీ, మహానది బొగ్గు బ్లాకుల నుంచి బొగ్గు సరఫరా ఉన్నప్పటికీ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి ఎందుకు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, టీజీ జెన్కో సీఎండీ ఎస్.హరీశ్పైనా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. పంట చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రానున్న 20 రోజులు పంటలకు కీలకమని, విద్యుత్ కొరత కారణంగా రైతులు నష్టపోయే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని అన్నారు. వ్యవసాయ విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి సరఫరా పెంచాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో లోటు వర్షపాతం, ఎల్నినో ప్రభావం, విద్యుత్, తాగునీటి సరఫరా పరిస్థితులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా మెరుగుపర్చాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే నిర్లక్ష్యాన్ని సహించబోనని, ప్రజలకు తాను జవాబుదారీగా ఉన్నానని స్పష్టం చేశారు.