‘వెల్‌కమ్‌ విరాట్‌’.. కోహ్లీకి సత్య నాదెళ్ల స్పెషల్‌ మెసేజ్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘వెల్‌కమ్‌ విరాట్‌’.. కోహ్లీకి సత్య నాదెళ్ల స్పెషల్‌ మెసేజ్‌

Virat Kohli first LinkedIn post gets response from Microsoft CEO Satya Nadella
  • ‘నా ఫీడ్‌ మరింత ఆసక్తికరంగా మారింది’ అంటూ వ్యాఖ్య
  • వన్‌8వరల్డ్‌ కొత్త ప్రయాణానికి అభినందనలు
  • భారత క్రీడా బ్రాండ్లకు ప్రపంచ గుర్తింపు కోహ్లీ లక్ష్యం
  • తొలి 24 గంటల్లో 2.4 లక్షలు దాటిన ఫాలోవర్లు
మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల టీమ్ఇండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీని లింక్డిన్‌లోకి ఆహ్వానించారు. కోహ్లీ లింక్డిన్‌లో చేసిన తొలి పోస్టుపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. “నా ఫీడ్‌ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. లింక్డిన్‌లోకి స్వాగతం విరాట్‌! వన్‌8వరల్డ్‌తో మీ కొత్త ప్రయాణానికి అభినందనలు” అని పేర్కొన్నారు. కోహ్లీ వ్యాపార రంగంలో చేపడుతున్న కొత్త ప్రయత్నాలకు నాదెళ్ల స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కోహ్లీ తన తొలి లింక్డిన్‌ పోస్టులో భారత క్రీడలకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావాలన్న ఆకాంక్షను వెల్లడించారు. దేశంలో అన్ని క్రీడలకు ఆదరణ పెరగాలని, భారతీయ బ్రాండ్లు అంతర్జాతీయ మార్కెట్‌లో గుర్తింపు పొందాలని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో అగిలిటాస్‌ స్పోర్ట్స్‌లో పెట్టుబడిదారుడిగా, వన్‌8వరల్డ్‌లో సహ వ్యవస్థాపకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. 

కోహ్లీ పోస్టుకు సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోంది. లింక్డిన్‌లో చేరిన తొలి 24 గంటల్లోనే ఆయన ఫాలోవర్ల సంఖ్య 2.4 లక్షలు దాటినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. క్రికెట్‌లోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేయాలన్న కోహ్లీ ప్రయత్నానికి నాదెళ్ల అభినందనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Advertisement
Virat Kohli
Satya Nadella
LinkedIn
One8 World
Microsoft CEO
Agilitas Sports

More Telugu News