లలితా త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ.. పోటెత్తిన భక్తులు
- అమ్మవారి దర్శనానికి తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తులు
- శ్రీచక్ర అధిష్టాన దేవతగా, మోక్ష ప్రదాయినిగా లలితా దేవికి పూజలు
- అమ్మవారిని దర్శించుకుని ఏర్పాట్లను ప్రశంసించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన గురువారం కనకదుర్గమ్మ వారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకునేందుకు తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు.
శ్రీచక్ర అధిష్టాన దేవతగా, పంచదశాక్షరీ మంత్రానికి అధిదేవతగా లలితా దేవిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ప్రకృతి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ రోజు దర్శించుకుంటే సకల సంపదలు, సౌభాగ్యాలు చేకూరుతాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చిరునవ్వులు చిందిస్తూ, చేత చెరుకుగడను ధరించి, పరమశివుని అంకపీఠంపై ఆసీనురాలై ఉన్న అమ్మవారికి ఇరువైపులా లక్ష్మీ సరస్వతులు వింజామరలు వీస్తున్నట్లుగా ఈ అలంకారాన్ని తీర్చిదిద్దారు.
రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ ఉదయం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దుర్గమ్మను దర్శించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సామాన్య భక్తుల కోసం ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు.