దేవుళ్ల మధ్య చిచ్చు: రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

Telangana
Advertisement
  • శివుడు, రాముడిపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
  • దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగడంపై కిషన్ రెడ్డి అభ్యంతరం
  • ఇచ్చిన హామీలు పక్కనపెట్టి కొత్త వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పరమేశ్వరుడు పేదల దేవుడని, శ్రీరాముడు ధనికుల దేవుడని సీఎం చేసిన వ్యాఖ్యలు మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విమర్శలు చేశారు.

ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలతో ఏకంగా దేవుళ్లను కూడా రాజకీయాల్లోకి లాగారని కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. శివుడు, రాముడి పేర్లతో చేసిన ఈ వ్యాఖ్యలు యావత్ హిందూ సమాజాన్ని అవమానించేలా ఉన్నాయని, హిందువుల మధ్య అనవసర గొడవలు పెట్టే ప్రయత్నమని అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనపెట్టి, ఇలాంటి కొత్త వివాదాలను ముందుకు తెస్తోందని ఆరోపించారు. ప్రజలను విభజించడం కాంగ్రెస్ పార్టీకి ఎప్పటినుంచో ఉన్న అలవాటు అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. "హిందూ దేవుళ్లపై మాట్లాడిన విధంగా ఇతర మతాల దేవుళ్ల గురించి మాట్లాడే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా?" అని ఆయన ప్రశ్నించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Kishan ReddyRevanth ReddyTelangana PoliticsLord Shiva Lord Rama commentsBJP vs Congress TelanganaHindu religious sentiments

More Telugu News

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40

అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాట్లకు 258 స్థానాలు.. 1992 తర్వాత అతిపెద్ద విజయం

23 Nov, 07:18

ఒక్కడి పట్టుదల.. 8 ఏళ్ల నిరీక్షణ.. ఎట్టకేలకు ముంబై మెట్రోకు లైన్ క్లియర్

23 Nov, 07:15

రోజూ అన్నం పెట్టిన వృద్ధుడి అంతిమయాత్రలో వీధి కుక్క.. శ్మశానంలో మౌనంగా కూర్చున్న 'కాలు'

23 Nov, 07:01

జెప్టోకు తొలుత వచ్చినవి 31 ఆర్డర్లే.. మూతపడే పరిస్థితి నుంచి ఎలా ఎదిగిందో చెప్పిన సహ వ్యవస్థాపకుడు

23 Nov, 06:54

డెల్టా ఎయిర్‌లైన్స్‌లో సాంకేతిక లోపం... అమెరికాలో 3,500 విమానాలు ఆలస్యం

23 Nov, 06:50

2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్, కోహ్లీ!

23 Nov, 06:40

తిలక్ వర్మ అద్భుత సెంచరీ.. అయినా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ ఓటమి

23 Nov, 06:34

తీర్పులను విమర్శించండి.. రాజ్యాంగ వ్యవస్థలను కాదు: సీజేఐ సూర్యకాంత్

23 Nov, 06:20

చేవెళ్లలో దొంగతనం ఫిర్యాదు చేసిన మహిళ హత్య: 24 గంటల్లో నిందితుడి అరెస్ట్

23 Nov, 06:18

తెలంగాణలో ‘కోత’ల మోత.. ప్రతీ పదిలో ఆరు సిజేరియన్లే!

23 Nov, 00:57

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 90 సీట్లు గెలుచుకుంటుంది: సీఎం రేవంత్ రెడ్డి

22 Nov, 23:36

బిస్లెరీ వాటర్ లో ప్రమాదకర రసాయనాలు.. చర్యలకు సిద్ధమైన ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ

22 Nov, 22:57

నవంబర్ చివరి వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం!

22 Nov, 22:47

ఏలియన్స్ కోసం నాసా పంపిన గోల్డెన్ రికార్డ్‌లో తెలుగు పలకరింపు.. ఆసక్తికర వివరాలు ఇవిగో!

22 Nov, 22:40
..More Telugu News