కూటమిలో సమన్వయమే స్థానిక ఎన్నికల్లో విజయానికి కీలకం: పల్లా శ్రీనివాసరావు
- స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా విశాఖలో ఎన్డీఏ సమన్వయ సమావేశం
- కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలన్న పల్లా
- గ్రామస్థాయి నుంచి కలిసికట్టుగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం
- అనుకూలమైన అభ్యర్థులను గుర్తించాలని సమావేశంలో కీలక నిర్ణయం
- టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు హాజరు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి కార్యాచరణను ముమ్మరం చేసింది. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మధ్య సమన్వయం సాధించి, సమష్టిగా ముందుకు సాగేందుకు అవసరమైన వ్యూహాలపై చర్చించేందుకు విశాఖలో కీలక సమావేశం జరిగింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన నగరంలోని టీడీపీ జోనల్ కార్యాలయంలో ఈ భేటీని నిర్వహించారు.
ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూటమి పార్టీల శ్రేణుల మధ్య సమన్వయమే విజయానికి అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు ప్రకటించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమన్వయ కమిటీలను మరింత చురుగ్గా మార్చాలని సూచించారు.
స్థానిక సమస్యలు, ప్రజావసరాలపై పూర్తి అవగాహన ఉండి, ప్రజల్లో ఆదరణ కలిగిన అత్యంత అనుకూలమైన అభ్యర్థులను గుర్తించడంపై దృష్టి సారించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. క్షేత్రస్థాయిలోని రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, అందుకు అనుగుణంగా కార్యాచరణలో మార్పులు చేసుకోవాలని నేతలకు సూచించారు. ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య నిరంతర సమాచార మార్పిడి ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి ఐక్యతను చాటాలని, సమష్టి కృషితో ఘన విజయం సాధించాలని పల్లా పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో విశాఖపట్నం జిల్లా పార్లమెంట్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి ఎం.ఏ. షరీఫ్, జిల్లా ఇన్చార్జి మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, మూడు పార్టీల ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.