బాక్సాఫీస్ వద్ద ఆగని నాని జోరు.. మూడ్రోజుల్లో 'ది ప్యారడైజ్'కు భారీ వసూళ్లు

బాక్సాఫీస్ వద్ద ఆగని నాని జోరు.. మూడ్రోజుల్లో 'ది ప్యారడైజ్'కు భారీ వసూళ్లు

Nani The Paradise unstoppable at box office earns huge collections in three days
  • మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్ల గ్రాస్
  • నాని కెరీర్‌లో అత్యంత వేగంగా రూ. 100 కోట్లు దాటిన చిత్రం
  • త్వరలోనే రూ. 150 కోట్ల మార్క్‌ను అందుకునే అవకాశం
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ చిత్రానికి మిక్స‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ, నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించిన సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. ఇప్పుడు మూడు రోజులకే ఈ భారీ వసూళ్లతో తన సత్తా చాటుతోంది.

సినిమా వసూళ్లను పరిశీలిస్తే, మూడో రోజు సుమారు రూ. 22 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. రెండో రోజుతో పోలిస్తే వసూళ్లలో స్వల్ప తగ్గుదల కనిపించినా, వారాంతపు సెలవుల కారణంగా కలెక్షన్లు స్థిరంగా కొనసాగుతున్నాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇవాళ‌ కూడా దాదాపు ఇదే స్థాయిలో వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉందని, ఇదే జోరు కొనసాగితే త్వరలోనే ‘ది ప్యారడైజ్’ రూ. 150 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా సులభంగా అందుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి.


Advertisement
Nani
The Paradise
Srikanth Odela
The Paradise Box Office Collection
Nani The Paradise 3 Days Collections
Telugu Movie Box Office News

More Telugu News