వివేకా హత్య కేసు: వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందన్న సునీల్ యాదవ్
- వివేకా హత్య కేసులో రెండో రోజూ సునీల్ యాదవ్ విచారణ
- ఆర్థిక లావాదేవీలు, ఫోన్ కాల్స్‌పై అధికారుల ప్రశ్నలు
- రూ.40 కోట్ల సుపారీ నేపథ్యంలో మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు
- గంగిరెడ్డి, ఉమాశంకర్‌లకు కూడా నోటీసులు జారీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఈ కేసులో ఏ2 నిందితుడు సునీల్ యాదవ్‌ను శుక్రవారం వరుసగా రెండో రోజూ విచారించింది. ఈ సందర్భంగా తనకు వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని సునీల్ యాదవ్ ఈడీకి వాంగ్మూలం ఇవ్వడం సంచలనంగా మారింది.
హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ సాగింది. గురువారం కూడా అధికారులు సునీల్‌ను తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు. శుక్రవారం విచారణలో భాగంగా హత్య జరిగిన సమయంలో సునీల్ యాదవ్ లొకేషన్, గూగుల్ టేక్‌అవుట్ వివరాలు, ఇతర నిందితులు ఎర్ర గంగిరెడ్డి (ఏ1), ఉమాశంకర్ రెడ్డి (ఏ3)తో జరిపిన ఫోన్ కాల్స్ సంభాషణ, ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా ఆరా తీసినట్లు సమాచారం. అయితే, వివేకా హత్య జరిగిన సమయంలో తాను ఇంట్లోనే ఉన్నానని సునీల్ యాదవ్ చెప్పినట్లు తెలుస్తోంది.
వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ ఒప్పందం కుదిరిందని, అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరికి అడ్వాన్స్‌గా రూ. కోటి చేరిందని సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ నిధుల మార్పిడిపైనే ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆగస్టులో పలుచోట్ల సోదాలు కూడా నిర్వహించింది.
ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్ దస్తగిరిని విచారించిన ఈడీ అధికారులు, తదుపరి విచారణకు హాజరు కావాలని ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. వారు రేపు, ఎల్లుండి (27, 28 తేదీల్లో) తేదీల్లో విచారణకు హాజరుకానున్నారు.