తుమ్మల నాగేశ్వరరావు పనితీరు, వ్యక్తిత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల ప్రశంసలు

Telangana
Advertisement
  • ఇతర పార్టీల వారికి కూడా మంచి చేసే నాయకుడు తుమ్మల అన్న పాయల్ శంకర్, రాకేశ్ రెడ్డి
  • తుమ్మల అత్యంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారని ప్రశంస
  • ఏ సమస్యపై ఫోన్ చేసినా వెంటనే స్పందిస్తారని కితాబు
Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు పనితీరుపై బీజేపీ శాసనసభ్యులు పాయల్ శంకర్, రాకేశ్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. పార్టీలు వేరైనా ప్రజలకు మంచి చేసే నాయకుడిని, వారి నిబద్ధతను గుర్తించి మెచ్చుకోవడంలో తప్పులేదని వారు స్పష్టం చేశారు. "మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు అత్యంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఇంతటి ఓపిక, జవాబుదారీతనం ఉన్న మంత్రిని గతంలో చూడలేదు" అని వ్యాఖ్యానించారు.


ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏ సమస్యపై ఫోన్ చేసినా మంత్రి తుమ్మల వెంటనే స్పందిస్తారని... ఆదివారాలు లేదా సెలవు రోజుల్లో కూడా ప్రజా సమస్యలపై అందుబాటులో ఉంటారని తెలిపారు. సమీక్షలు లేదా పనుల్లో ఉండి ఫోన్ తీయలేకపోయినా, వీలైనంత త్వరగా తిరిగి ఆయనే కాల్ చేసి మాట్లాడతారని చెప్పారు.


ప్రజలు లేదా నియోజకవర్గాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళితే ఎంతో ఓపికతో విని, ఆ సమస్య పూర్తయ్యే వరకు అధికారులతో స్వయంగా మాట్లాడతారని పేర్కొన్నారు. పని ఏ దశలో ఉందో, ఎప్పుడు పరిష్కారమవుతుందో కూడా మళ్లీ తిరిగి ఫోన్ చేసి అప్‌డేట్ ఇవ్వడం ఆయన ప్రత్యేకత అని కొనియాడారు. శాసనసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు, తోటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పాలనా సమర్థతను, ఓపికను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు సూచించారు.

Advertisement

సంబంధిత వార్తలు

Tummala Nageswara RaoBJP MLAsPayal ShankarRakesh ReddyTelangana Agriculture MinisterTelangana Politics

More Telugu News

న్యూజిలాండ్ గడ్డపై కోహ్లీ క్రేజ్... ఎయిర్‌పోర్ట్‌లో సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్

30 Oct, 10:19

గూగుల్‌కు గట్టి ఎదురుదెబ్బ.. ఒక్కరోజే రూ.47ల‌క్ష‌ల కోట్లు నష్టం.. చరిత్రలోనే అతిపెద్ద పతనాల్లో ఒకటి!

30 Oct, 10:13

ఉపవాసంతో ఆరోగ్యం మెరుగవుతుందా? ఎక్కువసేపు పస్తులుంటే ఏమవుతుంది?

30 Oct, 10:05

నాకు ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదు: సీఎం విజయ్ తనయుడు జాసన్ సంజయ్

30 Oct, 10:00

రాష్ట్రస్థాయి షూటర్ ఘాతుకం.. పట్టపగలే తండ్రీకొడుకు సహా ముగ్గురిని కాల్చి చంపేశాడు!

30 Oct, 09:57

పాక్‌లోనూ ‘రామాయణ’ ఫీవర్.. రణ్‌బీర్ సినిమా కోసం కరాచీ హిందువుల పూజలు.. వీడియో వైరల్!

30 Oct, 09:51

అనిల్ కపూర్ ఇంట్లో కర్వా చౌత్ వేడుక... షారుఖ్ లేకుండా వచ్చిన గౌరీ ఖాన్

30 Oct, 09:40

అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులకు ఇస్తే ఊరుకోం.. కంపెనీలకు వాన్స్‌ వార్నింగ్‌!

30 Oct, 09:32

అర్నాబ్ తుపాను బీభత్సం: ఉగ్రరూపం దాల్చిన బాహుదా.. స్తంభించిన ఏపీ-ఒడిశా రవాణా!

30 Oct, 09:29

ఐఫోన్ దొంగలను వెంటాడి పట్టుకున్న యువతి.. ఢిల్లీలో సినీ ఫక్కీలో ఛేజింగ్!

30 Oct, 09:25

ఇషాన్‌ కిషన్‌ వస్తే.. వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కేనా?

30 Oct, 09:20

టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఆస్తులు రూ. 172 కోట్లు!

30 Oct, 09:16

ఏపీ తీరంలో సాహసోపేత ఆపరేషన్.. 20 మంది సిబ్బందిని రక్షించిన కోస్ట్ గార్డ్

30 Oct, 08:57

స‌ఫారీ క్రికెటర్ తల్లిపై ఫ్యాన్‌ ఫన్నీ ప్లకార్డు.. నవ్వులు పూయించిన అభిమాని.. ఇదిగో వీడియో!

30 Oct, 08:54

ఆగిపోయిన చిరంజీవి-నాని-శ్రీకాంత్ ఓదెల క్రేజీ ప్రాజెక్ట్?

30 Oct, 08:51
..More Telugu News