రాఖీ పండుగ రోజునే చంద్ర గ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ఆగస్టు 28న రానున్న పాక్షిక చంద్రగ్రహణం
- భారత్‌లో పగటిపూట కావడంతో గ్రహణం కనిపించదు
- దాదాపు 96 శాతం చంద్రుడిని కప్పనున్న భూమి నీడ
- ఎరుపు రంగులో కనిపించే అవకాశం ఉన్న చంద్రుడు
- దేశంలో ఎలాంటి గ్రహణ ప్రభావం, సూతకాలం వర్తించవు
ఈ ఆగస్టు 28న, రాఖీ పౌర్ణమి పండుగ రోజున అరుదైన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది దాదాపు సంపూర్ణ గ్రహణంలా కనిపించనుండటం దీని ప్రత్యేకత. అయితే, ఈ అద్భుతమైన ఖగోళ ఘటన భారత్‌లో కనిపించదు. దేశంలో ఆ సమయంలో పగటిపూట ఉండటమే దీనికి కారణం.
ఈ గ్రహణం ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లో అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 100 కోట్ల మంది దీనిని పూర్తిస్థాయిలో వీక్షించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐరోపా, ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా పాక్షికంగా కనిపిస్తుంది. అయితే ఆస్ట్రేలియా, అంటార్కిటికా, భారత్ సహా పసిఫిక్ తీరంలోని చాలా దేశాల్లో ఇది కనిపించదు.
ఎర్రగా కనిపించనున్న చంద్రుడు
ఈ పాక్షిక గ్రహణం సమయంలో చంద్రుడి ఉపరితలంపై దాదాపు 96 శాతం భూమి నీడ కప్పేస్తుంది. దీనివల్ల చంద్రుడు పూర్తి ఎరుపు రంగులో కాకపోయినా, 'బ్లడ్ మూన్' తరహాలో రక్తవర్ణంలోకి మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
భారత కాలమానం ప్రకారం గ్రహణ సమయాలు:
రాఖీ పండుగ రోజే గ్రహణం వస్తుండటంతో భారత్‌లో దీనిపై ఆసక్తి పెరిగింది. చాలామంది గ్రహణ సమయాల కోసం వెతుకుతున్నారు. భారత కాలమానం ప్రకారం, ఆగస్టు 28న ఉదయం 8:04 గంటలకు పాక్షిక గ్రహణం ప్రారంభమై, ఉదయం 9:43 గంటలకు గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. ఉదయం 11:22 గంటలకు పాక్షిక గ్రహణం ముగుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ పగటిపూట జరగనున్నందున భారత్‌లో కనిపించదు. కాబట్టి, దేశంలో ఎలాంటి గ్రహణ సూతకాలు లేదా ప్రత్యేక నియమాలు వర్తించవని పండితులు స్పష్టం చేస్తున్నారు.