రోజూ ఏడు గుడ్లు.. 20 కిలోలు తగ్గాడు.. వైరల్ డైట్‌పై నిపుణుల క్లారిటీ
- ఏడు నెలల్లో 20 కిలోలు తగ్గిన వివేక్ రాజ్‌పుత్
- రోజూ ఏడు పూర్తి గుడ్లు తిన్నట్లు వెల్లడి
- ట్రైగ్లిజరైడ్స్ 280 నుంచి 94కి తగ్గినట్లు వెల్లడి
- కొలెస్ట్రాల్ 200 నుంచి 180కి పడిపోయినట్లు చెప్పిన వివేక్ రాజ్‌పుత్
- గుడ్లు తినడం వల్లే కొలెస్ట్రాల్ తగ్గలేదన్న వైద్యులు
రోజూ ఏడు ఉడికించిన గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వ్యక్తి డైట్ ఇప్పుడు ఈ చర్చకు కారణమైంది. వివేక్ రాజ్‌పుత్ అనే వ్యక్తి ఏడు నెలల్లో 20 కిలోల బరువు తగ్గినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రతిరోజూ ఏడు పూర్తి గుడ్లు తింటున్నానని సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఇన్ని గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై వివేక్ మరో వీడియోలో తన ఆరోగ్య పరీక్షల వివరాలను పంచుకున్నారు. ఏడు పూర్తి గుడ్లు తింటున్నప్పటికీ తన ట్రైగ్లిజరైడ్స్ 280 నుంచి 94కి తగ్గాయని తెలిపారు. మొత్తం కొలెస్ట్రాల్ 200 నుంచి 180కి పడిపోయిందని చెప్పారు. గోధుమలు, మైదా, రొట్టెలను ఆహారం నుంచి తొలగించి.. రాత్రి భోజనంగా ఏడు గుడ్లు తీసుకుంటున్నట్లు వివరించారు.
అయితే ఈ ఫలితాలను చూసి అందరూ రోజూ ఏడు గుడ్లు తినడం మొదలుపెట్టకూడదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఏడు పూర్తి గుడ్లలో దాదాపు 1,300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుందని ఆంకాలజిస్ట్ డాక్టర్ వర్తికా విష్వాణి తెలిపారు. వివేక్ బరువు తగ్గడం, కార్బోహైడ్రేట్లను తగ్గించడం వల్ల ఆయన లిపిడ్ ప్రొఫైల్ మెరుగుపడి ఉండొచ్చని చెప్పారు. ఏడు గుడ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించాయని చెప్పడానికి ఆధారం లేదన్నారు.
మ్యాక్స్ హాస్పిటల్ గురుగ్రామ్ డైటెటిక్స్ విభాగం అధిపతి సురభి శర్మ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. గుడ్లలో ప్రొటీన్, విటమిన్ బీ12, కోలిన్, సెలీనియం వంటి పోషకాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఒక్క ఆహారంపైనే ఎక్కువగా ఆధారపడటం మంచిది కాదన్నారు. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులు, గింజలు కూడా ఆహారంలో ఉండాలని సూచించారు.
గుడ్లు తినడం వల్లే గుండె జబ్బులు వస్తాయన్న అభిప్రాయాన్ని తాజా పరిశోధనలు పూర్తిగా సమర్థించవు. అయితే ఎక్కువ గుడ్లు తినడం కొందరిలో మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ స్థాయులను స్వల్పంగా పెంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బుల ముప్పు ఉన్నవారు వైద్యుల సూచనతో గుడ్ల పరిమాణాన్ని నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.