మెడికో ప్రియాంక మృతి కేసులో కీలక పరిణామం.. దర్యాప్తుకు ప్రత్యేక ఐపీఎస్ అధికారి
- రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో దర్యాప్తు ముమ్మరం
- విచారణాధికారిగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్‌ను నియమించిన ప్రభుత్వం
- ప్రియాంక కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
- నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
- మద్యం మత్తులో యువకులు కారుతో ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయిన ప్రియాంక
రాజమండ్రిలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారి, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మునీష్‌ను ప్రత్యేక దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా విచారణ పూర్తి చేసి, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ దర్యాప్తులో ఏఎస్పీకి సౌత్ డీఎస్పీ శివప్రియ, ప్రకాశంనగర్ సీఐ బాజీలాల్ సహకరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న వైద్య విద్యార్థిని అకాల మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని అన్నారు. ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆయన, బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టవద్దని, వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రత్యేక అధికారిని నియమించింది.
అసలేం జరిగిందంటే..!
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఏక్లాస్‌పూర్‌కు చెందిన ప్రియాంక, తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని ఓ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ విభాగంలో పీజీ చదువుతున్నారు. ఆగస్టు 3వ తేదీ రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్‌లో సినిమా చూసి, స్నేహితుడితో కలిసి స్కూటీపై తిరిగి వస్తున్నారు. మాల్ గేట్ వద్ద వారు ఆగి ఉన్న సమయంలో మద్యం మత్తులో ఉన్న నామవరానికి చెందిన దుష్యంత్, లాలాచెరువుకు చెందిన ఆండ్రూ విలియం జోసెఫ్ అనే ఇద్దరు యువకులు తమ కారుతో ప్రియాంక స్కూటీని ఉద్దేశపూర్వకంగా మూడుసార్లు ఢీకొట్టారు. అనంతరం ఆమెపై నుంచి కారు పోనివ్వడంతో ప్రియాంక తలకు తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆగస్టు 5న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియాంక ఆగస్టు 10న మృతి చెందారు. ఈ దారుణ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవడంతో ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది.