అడల్ట్ ఫిల్మ్ కంపెనీ కోసం ఎప్‌స్టీన్‌ను నిధులు అడిగిన ఆంత్రోపిక్ సీఈవో భార్య

Anthropic CEO wife asked Epstein for adult film company funds
  • ఆంత్రోపిక్ సీఈవో భార్య కామీ క్లార్క్ చుట్టూ ముసురుకున్న వివాదం
  • పోర్న్ కంపెనీకి నిధుల కోసం ఎప్‌స్టీన్‌ను ఆశ్రయించిన వైనం
  • బయటపడిన ఎప్‌స్టీన్ ఈమెయిళ్లతో వెలుగులోకి సంచలన నిజాలు
  • ఆంత్రోపిక్‌లో అధికారిక హోదా లేకున్నా ఆమెదే కీలక పాత్ర
  • భారీ ఐపీవోకు సిద్ధమవుతున్న తరుణంలో తెరపైకి వివాదం 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో చాట్‌జీపీటీకి బలమైన పోటీదారుగా నిలుస్తున్న ‘క్లాడ్’ చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసిన ఆంత్రోపిక్ సంస్థలో ఒక సంచలన వివాదం వెలుగులోకి వచ్చింది. సంస్థ సీఈవో డారియో అమోడై భార్య, కంపెనీలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా భావించే కామీ క్లార్క్.. లైంగిక నేరస్థుడు, దివంగత ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్‌స్టీన్ వద్ద నుంచి నిధులు కోరినట్లు బయటపడింది. తన అడల్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ కోసం పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆమె ఎప్‌స్టీన్‌ను ఆశ్రయించినట్లు ఈమెయిల్ ఫైల్స్ ద్వారా స్పష్టమైంది.

అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ పత్రాల ప్రకారం, 2011లో కామీ క్లార్క్ ఆయనకు పరిచయమయ్యారు. అప్పటికే ఎప్‌స్టీన్ లైంగిక నేరారోపణలపై దోషిగా తేలారు. ఆ తర్వాత క్లార్క్ తన అడల్ట్ ఫిల్మ్ స్క్రిప్టులను ఎప్‌స్టీన్‌కు పంపుతూ, ఇది ‘కొద్దిగా ఎన్ఎస్ఎఫ్‌డబ్ల్యూ (నో సేఫ్ ఫర్ వర్క్)’ అని వ్యాఖ్యానించినట్లు ఈమెయిళ్లలో ఉంది. 2012లో తన కంపెనీలో పెట్టుబడి పెట్టాలని ఆమె మరోసారి కోరగా, "నేను టీవీ సెక్స్ రంగానికి నిధులు ఇవ్వలేను" అని ఎప్‌స్టీన్ తిరస్కరించారు. వారి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని నివేదికలు స్పష్టం చేశాయి.

కామీ క్లార్క్‌కు ఆంత్రోపిక్‌లో అధికారికంగా ఎలాంటి హోదా లేదు. అయినప్పటికీ, ఆమెను సీఈవోకు ‘షాడో అడ్వైజర్’‌గా పరిగణిస్తారు. గతంలో గూగుల్ మాజీ అధిపతి ఎరిక్ స్మిత్‌తో ఉన్న పరిచయం ద్వారా ఆంత్రోపిక్‌కు ఆమె కీలక ఫండింగ్ సమకూర్చడంలో సాయపడ్డారు. దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై కూడా ఆమె సీఈవో వెంట ఉంటూ కీలక ఇన్వెస్టర్లతో చర్చలు జరుపుతున్నారు.

ప్రస్తుతం ఆంత్రోపిక్ సుమారు 2 ట్రిలియన్ డాలర్ల విలువతో ఐపీవోకు సిద్ధమవుతున్న తరుణంలో, సంస్థలో ఇంతటి పలుకుబడి ఉన్న కామీ క్లార్క్ గతం తెరపైకి రావడం సిలికాన్ వ్యాలీలో తీవ్ర చర్చకు దారితీసింది.
Advertisement
Cami Clark
Anthropic CEO wife
Jeffrey Epstein
Dario Amodei
Claude AI
Adult film funding

More Telugu News