జాతిపితకు ఐసీసీ నివాళి: గాంధీ జయంతినే 2027 వరల్డ్ కప్ ఆరంభం!
- జాతిపితకు గౌరవంగా ఐసీసీ, ఆతిథ్య దేశాల కీలక ప్రతిపాదన
- దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యం
- మళ్లీ 'సూపర్ సిక్స్' ఫార్మాట్‌తో 14 జట్ల మధ్య టోర్నీ
- త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించనున్న 2027 పురుషుల వన్డే ప్రపంచకప్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళిగా, ఈ మెగా టోర్నీని ఆయన జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించాలని ఐసీసీ ప్రాథమికంగా నిర్ణయించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీని గాంధీ జయంతి రోజున ప్రారంభించడం ద్వారా ఆయనకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ చేసిన పోరాటం చారిత్రాత్మకం. తన జీవితంలో 21 సంవత్సరాలు (1893-1914) అక్కడే గడిపిన గాంధీజీ, సత్యాగ్రహ ఉద్యమానికి బీజం వేసింది కూడా అక్కడే. ఈ నేపథ్యంలో, దక్షిణాఫ్రికాలో గాంధీజీ సాగించిన వర్ణవివక్ష వ్యతిరేక పోరాటాన్ని, ఆయన అహింసా సిద్ధాంతాలను ప్రేరణగా తీసుకుని ఆ దేశ జాతిపిత నెల్సన్ మండేలా తదనంతర కాలంలో పోరాటం సాగించిన చారిత్రాత్మక బంధాన్ని స్మరించుకుంటూ.. ప్రపంచకప్‌ను ఆయన జయంతి రోజున ప్రారంభించడం సముచితంగా ఉంటుందని ఆతిథ్య దేశాల క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి.
2027 ప్రపంచకప్ ఫార్మాట్‌లో కీలక మార్పులు చేశారు. గత టోర్నీలో 10 జట్లు పాల్గొనగా, ఈసారి 14 జట్లతో నిర్వహించనున్నారు. ఈ జట్లను ఏడు చొప్పున రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-3లో నిలిచిన జట్లు 'సూపర్ సిక్స్' దశకు అర్హత సాధిస్తాయి. 2003 ప్రపంచకప్ తరహాలో ఈ ఫార్మాట్‌ను మళ్లీ ప్రవేశపెడుతున్నారు.
ఈ మెగా టోర్నీకి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వేలకు టోర్నీలో నేరుగా ప్రవేశం లభించింది. అయితే, నమీబియా మాత్రం క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. మొత్తం 54 మ్యాచ్‌లను జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్, డర్బన్‌తో పాటు హరారే, విండ్‌హోక్ వంటి ప్రముఖ వేదికల్లో నిర్వహించనున్నారు.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలోనే ఉంది. ప్రసార హక్కులు, మ్యాచ్‌ల షెడ్యూలింగ్ ఖరారైన తర్వాత ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 2న ప్రారంభమై సుమారు ఏడు వారాల పాటు ఈ టోర్నీ కొనసాగనుంది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, క్రికెట్ వేదికగా మహాత్ముడికి ప్రపంచం అందించే గొప్ప గౌరవంగా ఇది నిలిచిపోతుంది.