విమల్ ఇలాచీ యాడ్.. షారూఖ్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసులు!
- పాన్ మసాలా పరోక్ష ప్రచారంపై ముగ్గురు బాలీవుడ్ హీరోలకు నోటీసులు
- ప్రకటనల నుంచి తప్పుకోవాలని, సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశం
- తప్పు రుజువైతే రూ. 50 లక్షల వరకు జరిమానా, మూడేళ్ల నిషేధం ప్రమాదం
నిషేధిత పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై బాలీవుడ్ అగ్రనటులు షారూఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన శాఖ (ఎఫ్‌డీఏ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ చర్య బాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
'విమల్ ఇలైచి' పేరుతో చేస్తున్న ప్రకటన, వాస్తవానికి రాష్ట్రంలో నిషేధంలో ఉన్న 'విమల్ పాన్ మసాలా'ను గుర్తుచేసేలా ఉందని ఎఫ్‌డీఏ తన నోటీసులో ఆరోపించింది. మహారాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ తుకారాం ముండే జారీ చేసిన ఈ ఆదేశాల ప్రకారం.. సదరు నటులు వెంటనే ఈ ప్రచార కార్యక్రమాల నుంచి వైదొలగాలి. తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి యాడ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తొలగించాలి. బ్రాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను కూడా సమర్పించాలని ఆదేశించారు.
వినియోగదారుల పరిరక్షణ చట్టం ప్రకారం ఈ ఆరోపణలు రుజువైతే, వారిపై రూ. 10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఏ ఇతర బ్రాండ్ ప్రచారాల్లో పాల్గొనకుండా నిషేధం విధించే నిబంధనలు కూడా ఉన్నాయి.
గతంలో ఇదే బ్రాండ్ యాడ్‌లో నటించిన నటుడు అక్షయ్ కుమార్, 2022లో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బహిరంగంగా క్షమాపణలు చెప్పి, ఆ ప్రచారం నుంచి తప్పుకున్నాడు.