షర్మిలా ఠాగూర్ మతం మార్చుకున్నారా?.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కుమార్తె
- వివాహం కోసం షర్మిలా ఠాగూర్ ఇస్లాం స్వీకరించారని చెప్పిన కుమార్తె సబా
- పెళ్లి సమయంలో తన తల్లి పేరు 'ఆయేషా సుల్తానా'గా మారిందని వెల్లడి
- తమను లౌకిక వాతావరణంలో పెంచారని, అన్ని మతాలను గౌరవిస్తామని స్పష్టీకరణ
- ఇంట్లో దీపావళి, ఈద్ వంటి అన్ని పండుగలు జరుపుకొంటామని తెలిపిన సబా
సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ మత మార్పిడి గురించి చాలాకాలంగా జరుగుతున్న ప్రచారంపై ఆమె కుమార్తె సబా పటౌడీ స్పష్టత ఇచ్చారు. తన తల్లి, దివంగత క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకునే సమయంలో ఇస్లాం మతాన్ని స్వీకరించిన మాట వాస్తవమేనని ఆమె ధ్రువీకరించారు. అయితే, తమ కుటుంబంలో అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తూ, లౌకిక వాతావరణంలో పెరిగామని తెలిపారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సబా పటౌడీ మాట్లాడుతూ "1969లో నాన్నను పెళ్లి చేసుకునేందుకు అమ్మ ఇస్లాం స్వీకరించి, 'ఆయేషా సుల్తానా'గా పేరు మార్చుకున్నారు. అది ఆమె వ్యక్తిగత నిర్ణయం. ఆ తర్వాత ఇంట్లో మతపరమైన కట్టుబాట్లను మాపై ఎప్పుడూ రుద్దలేదు" అని వివరించారు. తమ తండ్రి ఇస్లామిక్ సంప్రదాయాలను పాటిస్తే, తల్లి తన బెంగాలీ హిందూ సంస్కృతిని, పండుగలను కొనసాగించేవారని గుర్తుచేసుకున్నారు.
"మా ఇంట్లో దీపావళి, ఈద్, దుర్గాపూజ వంటి అన్ని పండుగలను ఒకే గొడుగు కింద ఎంతో సంతోషంగా జరుపుకొనేవాళ్లం. మమ్మల్ని (సైఫ్, సోహా, నేను) అన్ని సంస్కృతులను గౌరవించేలా పెంచారు" అని సబా తెలిపారు. భారత సినీ, క్రీడా రంగాల్లో షర్మిలా-టైగర్ పటౌడీల వివాహం ఒక చారిత్రక అంతర్మత వివాహంగా నిలిచిపోయింది. గతంలో షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్, సోహా అలీ ఖాన్ కూడా తాము లౌకిక భావాలతో పెరిగామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు.