గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికా కోర్టులో కేసు కొట్టివేత
- ఆయనపై నమోదైన క్రిమినల్ ఛార్జీలను కొట్టివేసిన న్యాయస్థానం
- తీర్పును గౌరవిస్తున్నానని, న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పిన అదానీ
- భారత్‌లో సోలార్ కాంట్రాక్టులకు సంబంధించిన లంచం ఆరోపణలపై ఈ కేసు
- ప్రాసిక్యూటర్ల అభ్యర్థన మేరకు కేసును కొట్టివేసిన న్యూయార్క్ కోర్టు
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ ఛార్జీలను యూఎస్ కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును గౌరవిస్తున్నానని, సత్యం, న్యాయంపై తనకున్న నమ్మకం చెక్కుచెదరలేదని అదానీ పేర్కొన్నారు.
ఈ విషయమై ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందించారు. న్యాయ ప్రక్రియను తాను ఎంతో గౌరవిస్తున్నానని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తమ గ్రూప్‌పైనా, న్యాయవ్యవస్థపైనా, భారత దేశ న్యాయ సామర్థ్యంపైనా నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. దేశ నిర్మాణానికి, విలువలను సృష్టించేందుకు తమ నిబద్ధత కొనసాగుతుందని అన్నారు.
భారత్‌లో సోలార్ పవర్ కాంట్రాక్టులకు సంబంధించిన లంచం ఆరోపణలు, అమెరికన్ ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించారన్న అభియోగాలపై గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై ఈ కేసు నమోదైంది. అయితే, ఈ కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టును అభ్యర్థించారు. ఈ కేసు అధిక భాగం భారత్‌తో ముడిపడి ఉందని, దీని విచారణ కొనసాగించడం వల్ల న్యాయ ప్రయోజనాలు నెరవేరవని వారు వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యూయార్క్‌లోని ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ జడ్జి నికోలస్ గారౌఫిస్ నిన్న కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.