ఆదివాసీలతో కలిసి డప్పు కొట్టిన చంద్రబాబు.. ఉత్సాహంగా ధింసా స్టెప్పులేసిన సీఎం
- అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- గిరిజన మహిళలతో కలిసి ధింసా నృత్యం, డప్పు కొట్టి అలరించిన సీఎం
- దేశానికి ఉన్నట్టే ప్రతి పౌరుడికీ వ్యక్తిగత విజన్ ఉండాలని పిలుపు
- 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే తన సంకల్పమని స్పష్టం చేసిన చంద్రబాబు
- నిబద్ధతతో పనిచేయడమే నిజమైన దేశభక్తి అని ఉద్ఘాటన
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వారితో మమేకమయ్యారు. డప్పు వాయిస్తూ, ధింసా నృత్యకారులతో కలిసి అడుగులు వేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఆదివారం విజయవాడలోని అంబేడ్కర్ కళావేదికలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబుకు గిరిజన మహిళలు, మంత్రి సంధ్యారాణి, ఇతర నేతలు ఘనస్వాగతం పలికారు. సంప్రదాయ ధింసా నృత్యం, డప్పు వాయిద్యాల నడుమ సీఎం వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా డప్పు చేతబట్టి వాయించి సభలో కొత్త ఉత్తేజం నింపారు.
అంతకుముందు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ప్రతి పౌరుడూ దేశం, రాష్ట్రం, గ్రామం, కుటుంబం కోసం ఓ సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని ఆరాధిస్తూ, సంప్రదాయాలను కాపాడుతున్న గిరిజనులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సాధిస్తారని కొనియాడారు. సామాన్య ఆదివాసీ మహిళ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి స్థాయికి ఎదగడమే దీనికి నిదర్శనమని గుర్తుచేశారు.
"మన సంకల్పమే మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, ప్రధాని మోదీ వంటి ఎందరో సామాన్యులే సంకల్ప బలంతో అసాధారణ విజయాలు సాధించారు" అని చంద్రబాబు అన్నారు. "నేను, నా దేశం, నా రాష్ట్రం అనే భావనతో ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలనేది నా సంకల్పం" అని స్పష్టం చేశారు.
ఒక రైతు పంట పండించినా, ఒక విద్యార్థి బాగా చదివినా, ఉద్యోగి నిబద్ధతతో పనిచేసినా అదంతా దేశ నిర్మాణంలో భాగమేనని ఆయన వివరించారు. "వ్యక్తిగతంగా విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే. పనిచేసే ప్రతి వ్యక్తీ సమాజానికి ఆస్తి. అందరి గెలుపే దేశం గెలుపు" అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ 'వికసిత్ భారత్' దార్శనికతకు అనుగుణంగా, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత విజన్‌తో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.