భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.. బొబ్బిలి వీణతో చంద్రబాబు సత్కారం

Andhra
Advertisement
  • భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
  • ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
  • ప్రధాని మోదీకి బొబ్బిలి వీణను బహూకరించిన ముఖ్యమంత్రి
  • గిన్నిస్ రికార్డ్ సాధించిన థింసా నృత్యాన్ని వీక్షించిన ప్రధాని
  • ఎయిర్‌పోర్ట్‌లోని ఆధునిక సదుపాయాలను పరిశీలించిన మోదీ
Advertisement
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ జస్టిస్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, అశోక్‌గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనంలో కలియదిరిగి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. విమానాశ్రయం ప్రత్యేకతలు, నిర్మాణ విశేషాలను జీఎంఆర్ గ్రూపు ఛైర్మన్ జి.మల్లిఖార్జునరావు, బిజినెస్ ఛైర్మన్ జీబీఎస్ రాజు ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రధాని మోదీకి ఉత్తరాంధ్ర కళావైభవానికి ప్రతీకగా నిలిచే బొబ్బిలి వీణను బహూకరించి సత్కరించారు. 

అంతకుముందు సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ జీపులో వస్తూ మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రధాని మోదీ వీక్షించారు. ఇటీవలే గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన థింసా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది యువతులు ప్రదర్శించిన ఈ నృత్యాన్ని చూసి ప్రధాని ఆసక్తి కనబరిచారు. ఈ క్రమంలో ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
Advertisement

సంబంధిత వార్తలు

Narendra ModiBhogapuram AirportChandrababu NaiduUttarandhra DevelopmentBobbili VeenaDhimsa Dance

More Telugu News

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్ధం.. ప్రతి పోలింగ్ కేంద్రంపై కెమెరా నీడ!

31 Oct, 18:13

మూడేళ్లు గడుస్తున్నా ఆ పనులు ముందుకు కదలడంలేదు: కొడంగల్‌లో డీకే అరుణ

31 Oct, 18:11

'డెమోక్రటిక్ సంఘ' నుంచి తప్పుకున్న రెజీనా

31 Oct, 17:52

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు: పేర్ని నాని

31 Oct, 17:36

87 పరుగుల ఓటమి ఎఫెక్ట్‌.. ఐదో టీ20లో భారత్‌ భారీ మార్పులు?

31 Oct, 17:28

'సైబర్ సెక్యూరిటీ కెప్టెన్'గా మమ్ముట్టి.. సినిమా కాదు.. రియల్!

31 Oct, 17:23
..More Telugu News