బాలకృష్ణను పరామర్శించిన సీఎం చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా

Both States
Advertisement
  • హైదరాబాద్ ఏఐజీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న బాలకృష్ణ
  • బావమరిదిని పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు
  • బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడిన సీఎం
  • గత వారం షూటింగ్‌లో మోకాలికి గాయపడటంతో శస్త్రచికిత్స
  • ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు
Advertisement
హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ‌ పరామర్శించారు. గత వారం సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు ఇటీవల మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చంద్రబాబు.. తన బావమరిది అయిన బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన ఎంత వేగంగా కోలుకుంటున్నదీ వాకబు చేశారు. అనంతరం వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి బాలకృష్ణకు అందిస్తున్న చికిత్స, తదుపరి పునరావాస ప్రణాళికల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ నెల‌ 21న రాజమండ్రిలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు బాలకృష్ణ ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆయన ఎడమ మోకాలికి తీవ్ర గాయం కావడంతో మరుసటి రోజే ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించి ఏఐజీ ఆసుప‌త్రిలో చేర్పించారు. వైద్య పరీక్షల అనంతరం బాలకృష్ణ ఎడమ కాలి క్వాడ్రిసెప్స్ టెండన్ (తొడ కండరాన్ని మోకాలి చిప్పకు కలిపే కణజాలం) చిరిగిందని, మోకాలికి ఇరువైపులా ఉన్న సహాయక కణజాలాలు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు నిర్ధారించారు.

దీంతో ఈ నెల‌ 23న వైద్యులు ఆయనకు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో గాయం చుట్టూ పేరుకుపోయిన రక్తాన్ని తొలగించి, చిరిగిన టెండన్‌ను మోకాలి చిప్పకు తిరిగి అతికించామని, దెబ్బతిన్న కణజాలాలకు మరమ్మతులు చేశామని ఆసుప‌త్రి వర్గాలు మెడికల్ బులెటిన్‌లో తెలిపాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని, నిపుణుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. 
Advertisement

సంబంధిత వార్తలు

Nandamuri BalakrishnaChandrababu NaiduAIG Hospital HyderabadBalakrishna Knee SurgeryBalakrishna Health UpdateTelugu Cinema News

More Telugu News

స్థానికాల్లోనూ అదే స్ఫూర్తి.. కూటమిని గెలిపించండి: ఎన్డీఏ నేతల విజ్ఞప్తి

27 Oct, 12:25

చెంబరంబాక్కం రిజర్వాయర్‌కు సీఎం విజయ్.. 2015 పునరావృతం కాకూడదని హెచ్చరిక!

27 Oct, 12:23

సిరీస్‌పై కన్నేసిన భారత్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న అయ్యర్‌!

27 Oct, 12:19

పండగ పూట ర్యాలీ వద్దు.. రాహుల్‌కు ఢిల్లీ వ్యాపారుల వినతి.. రూ.10,000 కోట్ల నష్టం తప్పదని ఆవేద‌న‌!

27 Oct, 12:17

అనిరుధ్‌-కావ్య రిసెప్షన్‌ కార్డు చూశారా? రాజసం ఉట్టిపడే డిజైన్‌ వైరల్‌!

27 Oct, 12:15

హౌతీలతో కాల్పుల విరమణ ఒప్పందం.. సౌదీ అరేబియా రూ.9,500 కోట్ల‌ ఆఫర్?

27 Oct, 11:51

ఆర్నబ్ తుపాను: ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం.. రోడ్డుపైకి బండరాళ్లు

27 Oct, 11:48

సోషల్‌ మీడియాలో 21 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో వచ్చింది 33 ఓట్లే!

27 Oct, 11:47

అతి తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’.. ఏపీ తీరం వైపు వేగంగా పయనం.. అల్లకల్లోలంగా మారిన సముద్రం

27 Oct, 11:45

గ్రావిటీతో నీళ్లిస్తే రాజీనామా చేస్తా: ప్రభుత్వానికి హరీశ్‌రావు సవాల్

27 Oct, 11:24

మహేశ్ సినిమాపై రాజమౌళి కీలక వ్యాఖ్యలు.. అది టైమ్ ట్రావెల్ కాదు, అంతకుమించి!

27 Oct, 11:22

‘హంతకుడిని కాదు.. ప్రేమికుడిని’.. ‘కింగ్‌’లో షారుక్‌ అదిరిపోయే లుక్‌

27 Oct, 11:20

రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కేటీఆర్

27 Oct, 11:18

చెప్పాం.. చేస్తున్నాం: కర్నూలు సోలార్ ప్లాంట్‌పై చంద్రబాబు ట్వీట్

27 Oct, 11:11

ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు విచారణ.. రాహుల్‌ గాంధీ పోస్టులో ‘సత్యం శివం సుందరం’

27 Oct, 10:56
..More Telugu News