నీట్ వివాదం, విద్యార్థుల ఆందోళనలపై స్పందించిన సానియా మీర్జా

23-07-2026 Thu 18:45 | National
Advertisement
  • నీట్ విద్యార్థులకు మద్దతు ప్రకటించిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
  • విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
  • విద్యా వ్యవస్థలో తక్షణ సంస్కరణలు అవసరమని స్పష్టం
  • హింసకు తావులేదని, శాంతియుతంగా పరిష్కరించాలని సూచన
Advertisement
నీట్-యూజీ 2026 పేపర్ లీకేజీపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా తన మద్దతు ప్రకటించింది. విద్యార్థుల వాదనలను వినాలని, దేశ విద్యా వ్యవస్థలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని ఆమె స్పష్టం చేసింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆమె ఒక ప్రకటన విడుదల చేసింది.

నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీ పరీక్షల కోసం ఏళ్ల తరబడి శ్రమించిన విద్యార్థులు, తాజా వివాదాల వల్ల అనిశ్చితిని ఎదుర్కోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "విద్యార్థులే మన దేశ భవిష్యత్తు" అని పేర్కొంటూ, విద్యార్థుల పట్ల తన సానుభూతిని తెలిపింది. పరీక్షల నిర్వహణ ప్రక్రియపై విద్యార్థుల్లో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

"మన సమాజంలో హింసకు తావు లేదు. యువత భవిష్యత్తును కాపాడేందుకు మనమందరం కలిసి శాంతియుత మార్గంలో పరిష్కారం కనుగొనాలి" అని సానియా మీర్జా పిలుపునిచ్చింది. 

ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేపర్ లీక్‌ల వ్యవహారంలో జవాబుదారీతనం వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పనితీరులో సమూల మార్పులు తీసుకురావాలని నిరసనకారుల ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Sania MirzaNEET UG controversyStudent protests DelhiNational Testing Agency NTADharmendra Pradhan resignation

More Telugu News

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46
..more