వియత్నాం బోటు ప్రమాదం.. మృతదేహాల తరలింపు వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- వియత్నాం బోటు ప్రమాదంలో ముగ్గురు ఏపీ వాసుల మృతి
- మృతదేహాల తరలింపునకు తక్షణ ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- క్షతగాత్రుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడి
- మృతుల తరలింపునకు భారత రాయబార కార్యాలయం ఏజెన్సీ ఏర్పాటు
- సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రులు లోకేశ్, అనిత, ఆర్టీజీఎస్
వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మరణించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వియత్నాం ప్రమాద బాధితులకు అందిస్తున్న సహాయంపై ఆయన నేడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.
వియత్నాంలోని ఫు క్వోక్ ద్వీపం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన విహారయాత్రలో ఈ విషాదం చోటుచేసుకుంది. పడవలో మొత్తం 32 మంది ప్రయాణిస్తుండగా, 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నారు. ఇదే ప్రమాదంలో గాయపడిన గెల్లే కిశోర్ అనే మరో ఏపీ వ్యక్తి ప్రస్తుతం వియత్నాంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని అధికారులు సీఎంకు వివరించారు.
మృతుల భౌతికకాయాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం ఒక ఏజెన్సీని నియమించిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మృతదేహాల అప్పగింత, తరలింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని వివరించారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని ఆదివారం విమానాల్లో స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేశామని, వారికి సంబంధిత మొబైల్ కంపెనీ విమాన టిక్కెట్లు సమకూర్చిందని వెల్లడించారు. బాధితులు సురక్షితంగా దేశానికి తిరిగి వచ్చే వరకు, మృతదేహాల తరలింపు పూర్తయ్యేంత వరకు అవసరమైన అన్ని సహాయక చర్యలు అందించాలని న్యూఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే మంత్రి లోకేశ్ వియత్నాంలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి, సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. సహాయక, పునరావాస కార్యక్రమాలను సమన్వయం చేసే బాధ్యతను రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్)కి అప్పగించారు.
ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 24 గంటలూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, ఏపీ భవన్, ఏపీఎన్ఆర్‌టీ సొసైటీలతో ఆర్టీజీఎస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ బాధితుల కుటుంబాలకు సత్వర సహాయం అందేలా చూస్తున్నారు.