స్టాక్ మార్కెట్లకు మళ్లీ జోష్.. లాభాల్లో ముగిసిన సూచీలు

  • సెన్సెక్స్ 238 పాయింట్లు పెరిగి 76,741 వద్ద క్లోజ్
  • నిఫ్టీ 80 పాయింట్ల లాభంతో 23,962 వద్ద ముగింపు
  • రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లలో కొనుగోళ్ల జోరు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ముగిశాయి. రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 238.22 పాయింట్ల లాభంతో 76,741.82 వద్ద స్థిరపడింది. ఇక, ఎన్ఎస్ఈ నిఫ్టీ 80.75 పాయింట్లు పెరిగి 23,962.80 వద్ద ముగిసింది.

ట్రేడింగ్‌లో సన్ ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, భారతీ ఎయిర్‌టెల్ వంటి షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచి మార్కెట్లకు ఊతమిచ్చాయి. అయితే, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ నష్టపోవడంతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. మరోవైపు, బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లతో పోలిస్తే బ్రాడర్ మార్కెట్లు ఉత్త‌మ‌ పనితీరు కనబరిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.38 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.80 శాతం మేర లాభపడ్డాయి.

దేశీయంగా మెరుగైన వర్షపాతం, కంపెనీల వాల్యుయేషన్లు వంటి అంశాలు మార్కెట్‌కు సానుకూలంగా ఉన్నాయని, అయితే అమెరికా ఫెడ్ మినిట్స్ ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Indian Stock Market
BSE Sensex
NSE Nifty
Sun Pharma
Share Market News
Nifty Midcap Smallcap

More Telugu News