భారత్‌లోకి నిస్సాన్ టెక్టన్ ఎస్‌యూవీ.. రూ.10.49 లక్షల నుంచి ప్రారంభం!
- రెండు టర్బో ఇంజిన్ ఆప్షన్లు
- 100 బీహెచ్‌పీ శక్తి, 166 ఎన్‌ఎం టార్క్
- జులై 9 నుంచి బుకింగ్‌లు, 20 నుంచి డెలివరీలు
- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ఏడీఏఎస్
- 5 స్టార్ భద్రతా రేటింగ్
మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో పోటీని మరింత పెంచుతూ నిస్సాన్ భారత్‌లో కొత్త ‘టెక్టన్’ మోడల్‌ను విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.10.49 లక్షలు (ఎక్స్‌షోరూమ్). టాప్ వేరియంట్ ధర రూ.18.59 లక్షల వరకు ఉంది. ఈ నెల 9 నుంచి బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. జులై 20 నుంచి డెలివరీలు ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది.
2023లో కిక్స్ ఎస్‌యూవీని నిలిపివేసిన తర్వాత నిస్సాన్ నుంచి వస్తున్న తొలి మిడ్‌సైజ్ ఎస్‌యూవీ ఇదే. మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న రెనో డస్టర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా సియెర్రా, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది.
టెక్టన్‌లో రెండు టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.0 లీటర్ ఇంజిన్ 100 బీహెచ్‌పీ శక్తి, 166 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు. లీటర్‌కు 19.4 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 163 బీహెచ్‌పీ శక్తి, 280 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. ఈ వేరియంట్‌లో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్నాయి. దీని మైలేజ్ లీటర్‌కు 18.5 కిలోమీటర్లుగా ప్రకటించింది.
డిజైన్ పరంగా టెక్టన్‌కు బలమైన ఎస్‌యూవీ లుక్ ఇచ్చారు. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కనెక్టెడ్ డీఆర్‌ఎల్స్, 18 అంగుళాల అలాయ్ వీల్స్, కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు ఆకట్టుకుంటాయి. 212 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో పాటు 2,657 ఎంఎం వీల్‌బేస్ ఉంది.
లోపల 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇందులో ఉన్నాయి.
భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవల్-2 ఏడీఏఎస్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు ఇచ్చారు. ఈ ఎస్‌యూవీకి భారత్ ఎన్‌క్యాప్‌లో ఇప్పటికే 5 స్టార్ భద్రతా రేటింగ్ వచ్చిన ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది.