ఏపీలో హస్తకళల పర్యాటకం.. పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
- టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం అభివృద్ధి
- కళాకారుల జీవితాలపై ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించాలని ఆదేశం
- ఉప్పాడ చీరలు, అరటి నార వస్తువులు కొనుగోలు చేసిన పవన్
- గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలకు ప్రత్యేక ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్‌లో ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటకం తరహాలోనే 'హస్తకళల పర్యాటకాన్ని' కూడా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. మంగళవారం విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఉత్సవం 2026'ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్న కళాకారులను గుర్తించి, వారిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కళాకారుల జీవన విధానం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్లస్టర్ల వారీగా ఉమ్మడి సౌకర్య కేంద్రాలను (కామన్ ఫెసిలిటీ సెంటర్లు) ఏర్పాటు చేస్తామని, చేతివృత్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే, కళాకారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.
అనంతరం, ఉత్సవం ప్రాంగణంలోని స్టాళ్లను సందర్శించిన పవన్ కల్యాణ్ కళాకారులతో ముచ్చటించారు. కాకినాడ తోలుబొమ్మలాట, ఉప్పాడ జామ్దానీ చీరలు, కలంకారీ కళాఖండాలు, తిరుపతి కొయ్యబొమ్మలు, నరసాపురం లేస్ ఉత్పత్తులతో పాటు అరటి నారతో రూపొందించిన వస్తువులను ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా కొన్ని ఉప్పాడ చీరలను, అరటి నారతో చేసిన హ్యాండ్‌బ్యాగ్‌ను కొనుగోలు చేసి కళాకారులను వ్యక్తిగతంగా అభినందించారు.
రామాయణ, మహాభారత ఘట్టాలను ప్రతిబింబిస్తూ సాగిన తోలుబొమ్మలాట ప్రదర్శన పవన్ కల్యాణ్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రాచీన కళకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు, రాబోయే గోదావరి పుష్కరాల సమయంలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆయన కళాకారులకు హామీ ఇచ్చారు.