పాప్ సింగర్‌పై ఆస్ట్రేలియా పీఎం హాట్ కామెంట్స్: విమర్శల తుపానుతో క్షమాపణలు చెప్పిన అల్బనీస్!
- పాప్ స్టార్ కైలీ మినోగ్‌పై అల్బనీస్ వ్యాఖ్యల దుమారం
- కామెడీ పాడ్‌కాస్ట్‌లో నోరు జారిన ప్రధాని
- తీవ్రస్థాయిలో మండిపడిన మహిళా సంఘాలు
- పీఎం పదవికి మచ్చ తెచ్చారన్న ప్రతిపక్షం
- విచారం వ్యక్తంచేసిన ఆంథోనీ అల్బనీస్
ఒక కామెడీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్.. ప్రముఖ పాప్ సింగర్ కైలీ మినోగ్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని హోదాలో ఉండి మహిళలను కించపరిచేలా, పదవికి ఉన్న గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడారంటూ ప్రతిపక్ష నేతలు, స్వతంత్ర ఎంపీలు, మహిళా సంఘాలు ఆయనపై విరుచుకుపడ్డాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో, సోమవారం అల్బనీస్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఎవరినైనా నొప్పించి ఉంటే బేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
జులై 2న విడుదలైన కమెడియన్ నిక్కీ ఓస్బోర్న్ 'బుష్ డీప్' పాడ్‌కాస్ట్‌లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ ఓస్బోర్న్.. ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు ప్రముఖ మహిళలు (కైలీ మినోగ్, నటి నికోల్ కిడ్మాన్, ఎంటర్‌టైనర్ రోండా బర్చ్‌మోర్) పేర్లను ప్రస్తావిస్తూ "ఎవరిని పెళ్లి చేసుకుంటారు? ఎవరితో డేటింగ్ చేస్తారు? ఎవరితో శృంగారం చేస్తారు?" అనే ఆటను ప్రధానితో ఆడించే ప్రయత్నం చేశారు.
మొదట తన భార్య జోడీ హేడన్‌ను గుర్తుచేస్తూ అల్బనీస్ ఈ ప్రశ్నను దాటవేయాలని చూసినప్పటికీ, హోస్ట్ పదే పదే ఒత్తిడి చేయడంతో పాప్ సింగర్ కైలీ మినోగ్ పేరును ఎంచుకున్నారు. ఆ ముగ్గురిలో కైలీతోనే పెళ్లి, డేటింగ్, శృంగారం అన్నీనా? అని హోస్ట్ అడగగా.. "అన్నీ ఆమెతోనే. ఆమె అద్భుతమైన మహిళ" అని ప్రధాని సమాధానమిచ్చారు.
అంతేకాకుండా, మీ భార్యతో లైంగిక జీవితం ఎలా ఉందంటూ ఆస్ట్రేలియన్ స్లాంగ్ ఉపయోగించి హోస్ట్ అడిగిన మరో ప్రశ్నకు ప్రధాని నవ్వుతూ.. "సమయం దొరికినప్పుడు బానే ఉంటుంది" అని చెప్తూ, తనకిష్టమైన రగ్బీ టీమ్ గెలిస్తే అది మంచి సెక్స్ ప్రేరకంలా పనిచేస్తుందని వ్యాఖ్యానించారు.
గతేడాది నవంబర్ 2025లో జోడీ హేడన్‌ను వివాహం చేసుకుని, పదవిలో ఉండగానే పెళ్లి చేసుకున్న మొదటి ఆస్ట్రేలియా ప్రధానిగా రికార్డు సృష్టించిన అల్బనీస్.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. 'కమ్యూనిటీ స్ట్రాంగ్ ఆస్ట్రేలియా' పార్టీకి చెందిన జాలీ స్టెగల్ స్పందిస్తూ.. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి దిగజారుడు ఆటల్లో పాల్గొనకూడదని, ఆ ప్రశ్నలను అక్కడికక్కడే ఖండించి ఆదర్శంగా నిలవాల్సింది పోయి శ్రుతిమించారని మండిపడ్డారు.
ప్రతిపక్ష సెనేటర్ సారా హెండర్సన్ మాట్లాడుతూ.. మద్యం మత్తులో మాట్లాడినట్టు ఉన్న ప్రధాని వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని, ఆస్ట్రేలియన్లు సిగ్గుపడేలా చేశాయని ధ్వజమెత్తారు. మరో సెనేటర్ మరియా కోవాసిక్ కూడా దీనిని తీవ్రమైన విచక్షణారాహిత్యంగా అభివర్ణించారు. అయితే పాలక లేబర్ పార్టీకి చెందిన డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్, మంత్రి టానియా ప్లిబెర్సెక్ లు ప్రధానికి మద్దతుగా నిలిచారు. ప్రధానికి దేశంలోని ఒక ప్రముఖ సెలబ్రిటీపై ఉన్న అభిమానంతో అన్న మాటలే తప్ప, ఎవరినీ అవమానించే ఉద్దేశం కాదని వారు సమర్థించారు. కాగా, ఈ వివాదంపై పాప్ స్టార్ కైలీ మినోగ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.