కాల్ మనీ మాఫియా వెనుక కేశినేని చిన్ని ఉన్నారు: చంద్రబాబుకు కేశినేని నాని బహిరంగ లేఖ

Andhra
Advertisement
  • చాగర్ల గాయత్రి అనే మహిళ ఐదు కోట్ల అప్పు చేసి వడ్డీతో 21 కోట్లు కట్టారన్న నాని
  • అయినా ఆమెను నాని, మూల్పూరి కిశోర్ వేధిస్తున్నారని ఆరోపణ
  • నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం లేదని మండిపాటు
Advertisement

విజయవాడలో ‘కాల్ మనీ’ మాఫియా మళ్లీ పడగ విప్పిందని, దీని వెనుక స్వయంగా స్థానిక టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని హస్తం ఉందంటూ మాజీ ఎంపీ, వైసీపీ నేత కేశినేని నాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ఎంపీతో పాటు ఆయన ముఖ్య అనుచరుడు మూల్పూరి కిశోర్ ఈ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారని లేఖలో ఆరోపించారు.


విజయవాడకు చెందిన మహిళా వ్యాపారవేత్త చాగర్ల గాయత్రి ఐదు కోట్ల రూపాయల అప్పు తీసుకుని, అసలుతో పాటు వడ్డీ కూడా కలుపుకుని మొత్తం రూ.21 కోట్లు పూర్తిగా కట్టేశారని... అయినా సరే ఎంపీ చిన్ని, ఆయన అనుచరుడు కిశోర్ ఆమెను వదలకుండా వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బాధితురాలికి బాపులపాడు మండలంలో ఉన్న 11 ఎకరాల ఖరీదైన భూమిని ఫోర్జరీ పత్రాల ద్వారా లాక్కోవడానికి, ఆ భూమిని కబ్జా చేసేందుకు రెవెన్యూ అధికారులపై ఎంపీ కార్యాలయం తీవ్ర ఒత్తిడి తెస్తోందని విమర్శించారు.


బాధితురాలి నివాసంలోకి చొరబడి దౌర్జన్యం చేసిన ఘటనపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటికీ, అధికార బలం కలిగిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్నారు. నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులను ప్రైవేట్ గూండా సైన్యంగా వాడుకుంటూ అర్ధరాత్రి వేళల్లో పౌరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న మూల్పూరి కిషోర్‌పై తక్షణమే పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.

గతంలో 2015లో విజయవాడను కుదిపేసిన కాల్ మనీ ఉదంతం తరహాలోనే ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయని, ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఈ అధికార అహంకార మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాలని కోరారు. బాధితురాలి కుటుంబానికి, ఆస్తులకు నిరంతర పోలీస్ రక్షణ కల్పించాలని... నగర ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భరోసా దక్కే వరకు సామాన్యుల పక్షాన తన పోరాటం ఆగేది లేదని కేశినేని నాని స్పష్టం చేశారు.

Advertisement

సంబంధిత వార్తలు

Kesineni NaniKesineni ChinniChandrababu NaiduCall Money Mafia VijayawadaMulpuri KishoreAndhra Pradesh Politics

More Telugu News

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18

ఏపీలో రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. సర్వం సిద్ధం.. ప్రతి పోలింగ్ కేంద్రంపై కెమెరా నీడ!

31 Oct, 18:13

మూడేళ్లు గడుస్తున్నా ఆ పనులు ముందుకు కదలడంలేదు: కొడంగల్‌లో డీకే అరుణ

31 Oct, 18:11

'డెమోక్రటిక్ సంఘ' నుంచి తప్పుకున్న రెజీనా

31 Oct, 17:52

స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు: పేర్ని నాని

31 Oct, 17:36

87 పరుగుల ఓటమి ఎఫెక్ట్‌.. ఐదో టీ20లో భారత్‌ భారీ మార్పులు?

31 Oct, 17:28
..More Telugu News