రూ.5 కోట్ల ఫెరారీపై ఆడుకున్న చిన్నారులు.. తల్లిదండ్రులను కోర్టుకు లాగిన యజమాని!

04-07-2026 Sat 11:27 | International
Advertisement
  • చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఘటన 
  • నలుగురు చిన్నారులు ఆడుకుంటూ ఫెరారీపై గీతలు గీసిన వైనం 
  • దెబ్బతిన్న పలు విడి భాగాలు
  • మరమ్మతులకు రూ.95 లక్షల వరకు అవుతుందని అంచనా
  • రూ.4.75 లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చిన తల్లిదండ్రులు
  • రాజీ కుదరకపోవడంతో కోర్టుకెక్కిన యజమాని
Advertisement
చైనాలో నలుగురు చిన్నారులు ఆడుకుంటూ రూ.5 కోట్లకు పైగా విలువైన ఫెరారీ కారుపై గీతలు గీశారు. దీంతో ఆ కారు యజమాని వారి తల్లిదండ్రులను కోర్టుకు లాగాడు. పరిహారం విషయంలో రాజీ కుదరకపోవడంతో సివిల్ కేసు దాఖలు చేశాడు.

యునాన్ ప్రావిన్స్‌లోని కున్మింగ్ నగరానికి చెందిన ఓ వ్యక్తి వ్యాపార పనుల కోసం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. తన ఎరుపు రంగు ఫెరారీ 488 GTB కారుపై గీతలు కనిపించాయి. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా 10 ఏళ్లలోపు నలుగురు చిన్నారులు కారుపై ఎక్కి ఆడుకోవడం కనిపించింది. వాళ్లు అద్దంపై జారడం, వెదురు కర్రలతో కొట్టడం వంటి దృశ్యాలు బయటపడ్డాయి.

ఈ ఘటనలో కారు బానెట్, పైకప్పు, ఫెండర్లు, టెయిల్ లైట్లు, అద్దాలు దెబ్బతిన్నాయి. ముందు బంపర్ కూడా పగిలినట్లు గుర్తించారు. ఈ కారుకు మార్కెట్ విలువ సుమారు దాదాపు రూ.5.04 కోట్లు. అసలు విడిభాగాలతో మరమ్మతులకు సుమారు దాదాపు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ప్రత్యామ్నాయ విడిభాగాలు ఉపయోగిస్తే ఖర్చు సుమారు రూ.28 లక్షలకు తగ్గే అవకాశం ఉందని స్థానిక మీడియా తెలిపింది.

యజమాని మొదట పోలీసులను ఆశ్రయించి, చిన్నారుల తల్లిదండ్రులతో రెండు దఫాల చర్చలు జరిపాడు. అయితే వారు కేవలం రూ.4.75 లక్షలు మాత్రమే పరిహారంగా ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అంతేకాకుండా చిన్నారులతో క్షమాపణ కూడా చెప్పించలేదని సమాచారం. దీంతో అసంతృప్తికి గురైన ఫెరారీ యజమాని పూర్తి మరమ్మతుల ఖర్చును వసూలు చేసేందుకు కోర్టులో సివిల్ కేసు వేశాడు.
Advertisement
FerrariChina car damage caseFerrari 488 GTBChildren damage luxury carKunming Yunnan car lawsuitLuxury car repair compensation

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more