ప్రశ్నిస్తే చంపేస్తారా? జనసైనికులపై ప్రకాశ్ రాజ్ ఫైర్... వీడియో ఇదిగో!
- యూట్యూబర్ అరెస్ట్‌పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం
- జనసేన తీరుపై తీవ్ర వ్యాఖ్యలు
- జనసేన కార్యకర్తలు గుండాల్లా ప్రవర్తిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు
- వారిపై చర్యలు తీసుకోవాలని పవన్, చంద్రబాబులను ట్యాగ్ చేసిన నటుడు
- యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై వీడియో విడుదల
ఈ వ్యవహారంలో జనసేన కార్యకర్తలు అతిగా ప్రవర్తిస్తున్నారని, పద్ధతిగా మెలగాలని ప్రకాశ్ రాజ్ హితవు పలికారు. కేసును న్యాయస్థానం చూసుకుంటుందని, దేశం మొత్తం ఈ పరిణామాలను గమనిస్తోందని ఆయన హెచ్చరించారు.
పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం ఆయన్ను పిఠాపురానికి తరలించగా, అక్కడ ఒక కేసులో బెయిల్ లభించింది. అయితే, జనసేన కార్యకర్తలు పెట్టిన మరో కేసులో పోలీసులు ఆయన్ను వెంటనే తిరిగి అరెస్టు చేశారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ను మచిలీపట్నం తరలించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే జనసేన కార్యకర్తల తీరును విమర్శిస్తూ ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.