పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రావణ్‌.. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి విచారిస్తున్న పిఠాపురం పోలీసులు

YouTuber Ravan arrested in Hyderabad for inappropriate comments on Pawan Kalyan
  • బొజ్జా కుమార్ ఫిర్యాదు మేరకు రావణ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి పిఠాపురం తరలించిన పోలీసులు
  • విచారణ అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టనున్న పోలీసులు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ రావణ్‌ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న హైదరాబాద్‌లో ఆయనను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, అనంతరం పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించి సుదీర్ఘంగా విచారిస్తున్నారు.


పోలీసుల కథనం ప్రకారం.. గతంలో ఏలూరులో జరిగిన ఒక బహిరంగ సభలో పవన్ కల్యాణ్‌తో పాటు, మంత్రి నాదెండ్ల మనోహర్‌లను ఉద్దేశించి రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని పిఠాపురానికి చెందిన జనసేన నాయకుడు బొజ్జా కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రావణ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేవలం ఏలూరు సభలోనే కాకుండా, గతంలోనూ వివిధ వేదికలు, సోషల్ మీడియా ఛానళ్లలో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలపై కూడా పోలీసులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత రావణ్‌ను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

YouTuber Ravan
Pawan Kalyan
Pithapuram Police
Janasena Party
Nadendla Manohar
Hyderabad Arrest

More Telugu News