అమెజాన్ ప్రైమ్ లో సెల్వ రాఘవన్ మూవీ!
- విలేజ్ నేపథ్యంలో సాగే 'మనితన్ దైవమగళం'
- ప్రధానమైన పాత్రల్లో సెల్వ రాఘవన్ - మైమ్ గోపీ
- ఏప్రిల్ 10వ తేదీన విడుదలైన సినిమా
- ఓటీటీలో అందుబాటులో ఉన్న కంటెంట్
తమిళనాడులోని ఒక గ్రామీణ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ సినిమా, ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. విజయ్ సతీశ్ నిర్మించిన ఈ సినిమాకి, డెన్నిస్ మంజునాథ్ దర్శకత్వం వహించాడు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో తెలుగు ఆడియోతోను ప్రేక్షకులను పలకరించనుంది.
గ్రామీణ ప్రాంతం .. అక్కడ ప్రజల జీవన విధానం .. స్థానికంగా నడిచే వ్యాపారాలు .. రాజకీయాలు .. పగలు .. ప్రతీకారాలు వంటి అంశాలు ఈ కథలో కనిపిస్తాయి. సెల్వ రాఘవన్ - మైమ్ గోపీ పాత్రలు .. వారి నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. అలాగే రవివర్మ కెమెరా పనితనం .. ప్రియన్ నేపథ్య సంగీతం ప్రధానమైన బలంగా కనిపిస్తాయి. గ్రామీణ నేపథ్యంలో కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా త్వరగా కనెక్ట్ అవుతుందనే చెప్పాలి.