మెగాఫోన్ పట్టిన రామ్.. ఘనంగా పూజా కార్యక్రమాలు
- స్వీయ దర్శకత్వంలో రామ్ పోతినేని కొత్త చిత్రం #RAPO23 ప్రారంభం
- రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని నిర్మాణం
- స్రవంతి రవికిషోర్, మురళీ పోతినేని చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు
- ‘ది లోన్ వోల్ఫ్ జర్నీ బిగిన్స్’ అంటూ సినిమా యూనిట్ ప్రకటన
ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ‘రాపో సినిమాటిక్స్’ అనే బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హీరో రామ్ స్వయంగా దర్శకత్వం వహిస్తుండడం విశేషం. సోషల్ మీడియాలో "ది లోన్ వోల్ఫ్ జర్నీ బిగిన్స్" అనే క్యాప్షన్ తో ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు. దీన్నిబట్టి ఇదొక యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండొచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
ఈ సినిమాకు భారీ టెక్నికల్ టీమ్ పనిచేయనుండటం విశేషం. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు కెమెరా బాధ్యతలు చేపట్టగా, స్టార్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్. ప్రకాశ్ వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.


