'ఇడుపు కాయితం'పై రగడ.. తెలంగాణ భాషపై గరికపాటి పాత‌ కామెంట్స్ వైరల్!

Both States
Advertisement
  • ప్రియదర్శి 'ఇడుపు కాయితం' సినిమా టైటిల్‌పై సోషల్ మీడియాలో వివాదం
  • ఆంధ్రా, తెలంగాణ నెటిజన్ల మధ్య భాషాపరమైన వాగ్వాదానికి దారితీసిన ట్రోల్స్
  • తెలంగాణ భాష శాస్త్రీయమైందని, గ్రాంథికానికి దగ్గరగా ఉంటుందన్న‌ గరికపాటి
Advertisement
ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో, సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు సమర్పణలో వస్తున్న 'ఇడుపు కాయితం' సినిమా టైటిల్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన నాటి నుంచి ఈ పేరుపై మొదలైన చర్చ, ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య భాషా వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గతంలో తెలంగాణ భాషపై చేసిన వ్యాఖ్యల వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

వివాదం ఎలా మొదలైందంటే?
'ఇడుపు కాయితం' అనే టైటిల్‌ను ప్రకటించగానే, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో దీనిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ఇదేం భాష? ఇది తెలుగేనా? ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేస్తారా?" అంటూ కొందరు, "సినిమాకు సబ్‌టైటిల్స్ తప్పనిసరి" అని మరికొందరు హేళన చేస్తూ పోస్టులు పెట్టారు. ఈ ట్రోల్స్‌తో తెలంగాణ భాషాభిమానులు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇది తమ యాసను, సంస్కృతిని అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కౌంటర్ కామెంట్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఈ వ్యవహారం 'ఆంధ్రా వర్సెస్ తెలంగాణ' భాషా వివాదంగా మారింది.

తెరపైకి గరికపాటి వీడియో
ఈ రగడ జరుగుతున్న తరుణంలో గరికపాటి నరసింహారావు గతంలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోను తెలంగాణ నెటిజన్లు షేర్ చేస్తున్నారు. తెలంగాణ భాష గొప్పతనాన్ని, దాని శాస్త్రీయతను వివరిస్తూ గరికపాటి చేసిన వ్యాఖ్యలను ప్రత్యర్థులకు సమాధానంగా వాడుకుంటున్నారు.

ఆ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. "తెలంగాణ భాష, గ్రాంథిక భాషకు చాలా దగ్గరైన భాష. వ్యాకరణం తెలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు తెలంగాణలో 'చేసిన్రు' అంటారు. పద్యాల్లో మనం 'చేసినారు' అని వాడతాం. నిష్పక్షపాతంగా చెబుతున్నా, తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష. దీనికి ప్రధాన కారణం, ఆ ప్రాంతంపై దిక్కుమాలిన ఆంగ్ల భాష ప్రభావం చాలా తక్కువగా ఉండటమే. ఆ ఆంగ్లేయులు సర్కార్ జిల్లాల్లో ప్రవేశించి అక్కడి భాషను, ఆచారాలను నాశనం చేశారు. అందుకే అక్కడ నోరు విప్పితే ఇంగ్లీష్ తప్ప తెలుగు రావడం లేదు" అని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, 'గరికపాటి గురువు గారు బరాబర్ చెప్పిన్రు' అంటూ తెలంగాణ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

'ఇడుపు కాయితం' అంటే ఏమిటి?
'ఇడుపు కాయితం' అనేది అచ్చమైన తెలంగాణ గ్రామీణ పదం అని భాషా నిపుణులు చెబుతున్నారు. గతంలో భార్యాభర్తలు విడిపోవాలనుకున్నప్పుడు, కోర్టుల చుట్టూ తిరగకుండా గ్రామ పెద్దల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రాన్నే (విడాకుల పత్రం) 'ఇడుపు కాయితం' అని పిలిచేవారని వారు వివరిస్తున్నారు. ఒక సినిమా టైటిల్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న మాండలిక భేదాలు, సాంస్కృతిక వైవిధ్యం మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Idupu KayithamGarikapati Narasimha RaoPriyadarshiTelangana dialect controversySukumar WritingsBunny Vasu

More Telugu News

స్థానికాల్లోనూ అదే స్ఫూర్తి.. కూటమిని గెలిపించండి: ఎన్డీఏ నేతల విజ్ఞప్తి

27 Oct, 12:25

చెంబరంబాక్కం రిజర్వాయర్‌కు సీఎం విజయ్.. 2015 పునరావృతం కాకూడదని హెచ్చరిక!

27 Oct, 12:23

సిరీస్‌పై కన్నేసిన భారత్‌.. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న అయ్యర్‌!

27 Oct, 12:19

పండగ పూట ర్యాలీ వద్దు.. రాహుల్‌కు ఢిల్లీ వ్యాపారుల వినతి.. రూ.10,000 కోట్ల నష్టం తప్పదని ఆవేద‌న‌!

27 Oct, 12:17

అనిరుధ్‌-కావ్య రిసెప్షన్‌ కార్డు చూశారా? రాజసం ఉట్టిపడే డిజైన్‌ వైరల్‌!

27 Oct, 12:15

హౌతీలతో కాల్పుల విరమణ ఒప్పందం.. సౌదీ అరేబియా రూ.9,500 కోట్ల‌ ఆఫర్?

27 Oct, 11:51

ఆర్నబ్ తుపాను: ఉప్పాడ తీరంలో సముద్రం ఉగ్రరూపం.. రోడ్డుపైకి బండరాళ్లు

27 Oct, 11:48

సోషల్‌ మీడియాలో 21 లక్షల మంది ఫాలోవర్లు.. ఎన్నికల్లో వచ్చింది 33 ఓట్లే!

27 Oct, 11:47

అతి తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’.. ఏపీ తీరం వైపు వేగంగా పయనం.. అల్లకల్లోలంగా మారిన సముద్రం

27 Oct, 11:45

గ్రావిటీతో నీళ్లిస్తే రాజీనామా చేస్తా: ప్రభుత్వానికి హరీశ్‌రావు సవాల్

27 Oct, 11:24

మహేశ్ సినిమాపై రాజమౌళి కీలక వ్యాఖ్యలు.. అది టైమ్ ట్రావెల్ కాదు, అంతకుమించి!

27 Oct, 11:22

‘హంతకుడిని కాదు.. ప్రేమికుడిని’.. ‘కింగ్‌’లో షారుక్‌ అదిరిపోయే లుక్‌

27 Oct, 11:20

రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది: కేటీఆర్

27 Oct, 11:18

చెప్పాం.. చేస్తున్నాం: కర్నూలు సోలార్ ప్లాంట్‌పై చంద్రబాబు ట్వీట్

27 Oct, 11:11

ఎస్‌ఐఆర్‌పై సుప్రీంకోర్టు విచారణ.. రాహుల్‌ గాంధీ పోస్టులో ‘సత్యం శివం సుందరం’

27 Oct, 10:56
..More Telugu News