స్వీయ దర్శకత్వంలో రామ్ కొత్త సినిమా... రేపే ప్రారంభం
- రేపు ప్రారంభం కానున్న రామ్ పోతినేని కొత్త చిత్రం #RAPO23
- ఈ సినిమాకు రామ్ స్వయంగా రచన, దర్శకత్వం
- సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం
- కృష్ణ పోతినేని నిర్మాతగా రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై నిర్మాణం
ఈ సినిమాకు రామ్ పోతినేని కేవలం హీరో, దర్శకుడే కాదు.. కథ కూడా ఆయనే అందిస్తుండటం విశేషం. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని 'రాపో సినిమాటిక్స్' అనే సొంత బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ తిరు ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేయనున్నారు.
ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పూజా కార్యక్రమం ముగిసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నటుడిగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రామ్, దర్శకుడిగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలని సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.