‘గోల్డ్ మ్యాన్’ సూర్యాభాయ్ అరెస్ట్

Telangana
Advertisement
  • తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానంటూ వసూళ్లు
  • దాదాపు రూ. 32 లక్షలు సమర్పించుకున్న బాధితులు
  • డబ్బులు అడిగిన బాధితులపైనే కేసు
  • హైదరాబాద్ నుంచి పారిపోతుండగా షాద్‌నగర్ వద్ద అదుపులోకి
కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరిస్తూ ‘గోల్డ్ మ్యాన్’గా స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్న సూర్యాభాయ్ అలియాస్ పల్లపు సురేష్ కుమార్‌ను హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి నాణ్యమైన బంగారాన్ని తెచ్చి మార్కెట్ ధర కంటే తక్కువకే ఇస్తానని నమ్మబలికిన సురేష్ కుమార్.. హిమాయత్ నగర్, నిలోఫర్‌కు చెందిన పలువురి నుంచి దాదాపు రూ. 32 లక్షలు వసూలు చేశాడు.  నెలలు గడుస్తున్నా బంగారం ఇవ్వకపోవడంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేశారు. 

దీంతో సెటిల్‌మెంట్ కింద కొందరికి రూ. 10 లక్షల విలువైన మూడు ఐఫోన్లు, రూ. 20 లక్షల చెక్కు ఇచ్చిన సూర్యాభాయ్.. ఆ తర్వాత మాట మార్చాడు. బాధితులే తనను బెదిరించి ఫోన్లు దొంగిలించారంటూ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో సూర్యాభాయ్ చేసిన మోసం వెలుగుచూసింది. దీంతో ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు నమోదైందని తెలుసుకుని హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన సూర్యాభాయ్‌ను పోలీసులు షాద్‌నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.

భారీ బంగారు చైన్లు, గాజులు వేసుకుంటూ సోషల్ మీడియాలో, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ సెలబ్రిటీలా తిరగడం సూర్యాభాయ్‌కు అలవాటు. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు అతడి లైఫ్‌స్టైల్‌పై నిఘా పెట్టడంతో అతడు ధరించే నగల్లో చాలా వరకు రోల్డ్ గోల్డ్ (గిల్ట్ నగలు) అని తేలింది.  
Advertisement

సంబంధిత వార్తలు

SuryabhaiGoldman Suryabhai arrestHyderabad gold scamPallapu Suresh KumarHyderabad policeGold fraud case

More Telugu News

సరిహద్దులు దాటిన ప్రేమ: బ్రిటన్ అమ్మాయి, ఖమ్మం అబ్బాయి ఒక్కటయ్యారు

23 Nov, 09:45

ఇస్లాం రూపంలో యూరప్‌లో క్రైస్తవానికి పెను సవాల్

23 Nov, 09:33

సూప్ డబ్బా బొమ్మ ఖరీదు రూ.80 కోట్లా? వేలంలో కళ్లు చెదిరే రికార్డు.. ఇందులో అంత స్పెషాలిటీ ఏముంది?

23 Nov, 09:30

క్షణికావేశంలో సొంతింటి కలను బూడిదపాలు చేసిన భర్త.. భార్యపై కోపంతో నోట్లను తగలబెట్టిన వైనం!

23 Nov, 09:26

రాబోయే రోజుల్లో మరిన్ని సర్వర్ డౌన్లు తప్పవా? మైక్రోసాఫ్ట్ సంచలన హెచ్చరిక!

23 Nov, 09:17

అల్జీమర్స్‌పై కొత్త ఆశలు.. వయాగ్రా తరహా మాత్రతో సానుకూల ఫలితాలు!

23 Nov, 09:10

'వెల్ ప్లేడ్ ఎంఎస్'.. ధోనీ ఐపీఎల్‌ వీడ్కోలుపై స‌చిన్ భావోద్వేగ సందేశం

23 Nov, 08:58

ఆయిల్ ధరలు, ఇరాన్ దూకుడు.. అన్నింటికీ డెమోక్రాట్లే కారణం: ట్రంప్

23 Nov, 08:43

పల్నాడులో భారీ హింసకు ప్లాన్.. బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు అరెస్ట్.. మొత్తం 66 మందిపై కేసులు

23 Nov, 08:39

ఆ స‌మ‌యంలో నాతో పాటు ఏ ఒక్క‌రైనా నిలబ‌డి ఉంటే.. నేనే మ్యాచ్ ముగించే వాడిని: కెప్టెన్‌ తిల‌క్ వ‌ర్మ

23 Nov, 08:15

తొలి టెస్టుపై భారత్ పట్టు.. విజయం దిశగా టీమిండియా

23 Nov, 08:13

బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందా?.. విశ్లేషకులు ఏమంటున్నారంటే!

23 Nov, 08:06

ఫుడ్ డెలివరీ కోసం రోజూ 100 కి.మీ. సైకిల్ తొక్కిన యువకుడు.. ఇప్పుడు సీఏ

23 Nov, 07:59

విదేశీ ఉపాధిలో తెలంగాణ టామ్‌కామ్ రికార్డ్.. 15 వేల మందికి కొలువులు!

23 Nov, 07:57

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40
..More Telugu News