అనంతగిరిలో రీల్స్ రచ్చ... ఉప్పల్ బాలుపై కేసు

Telangana
Advertisement
  • కదులుతున్న థార్ కారుపై నిలబడి ప్రమాదకర విన్యాసాలు
  • పర్యాటకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఫారెస్ట్ అధికారులు
  • వివాదంపై క్షమాపణలు చెప్పిన ఉప్పల్ బాలు, వాహనం సీజ్
సోషల్ మీడియా రీల్స్ కోసం ప్రమాదకర విన్యాసాలు చేసిన ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు చిక్కుల్లో పడ్డారు. వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి కొండల్లో, కదులుతున్న కారుపై స్టంట్స్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.

'హాయ్ గైస్... షాక్ అయ్యారా?' అనే డైలాగ్‌తో సుపరిచితుడైన ఉప్పల్ బాలు, అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న మహీంద్రా థార్ పైకెక్కి కేకలు వేస్తూ వీడియోలు చిత్రీకరించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పర్యాటకులు, భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించడమే కాకుండా, ఇతరుల భద్రతను ప్రమాదంలో నెట్టేలా ప్రవర్తిస్తున్నారని వారు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అందిన ఫిర్యాదులపై స్పందించిన అధికారులు, ప్రజా శాంతికి భంగం కలిగించడం, అటవీ నిబంధనలు ఉల్లంఘన వంటి అభియోగాల కింద ఉప్పల్ బాలుపై కేసు నమోదు చేశారు. విన్యాసాల కోసం వినియోగించిన థార్ వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు, దాని యజమానికి నోటీసులు జారీ చేశారు.

ఈ వివాదంపై ఉప్పల్ బాలు స్పందిస్తూ బహిరంగ క్షమాపణలు కోరారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, వీడియో చిత్రీకరించే సమయంలో ఆ ప్రాంతం ఖాళీగా ఉందని వివరించారు. తన బంధువు కొత్త కారు కొనడంతో సరదాగా చేసిన పని వివాదాస్పదమైందని, తన ప్రవర్తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Uppal BaluAnantagiri HillsVikarabad PoliceMahindra Thar StuntsSocial Media Reels CaseTelugu Influencer Controversy

More Telugu News

సరిహద్దులు దాటిన ప్రేమ: బ్రిటన్ అమ్మాయి, ఖమ్మం అబ్బాయి ఒక్కటయ్యారు

23 Nov, 09:45

ఇస్లాం రూపంలో యూరప్‌లో క్రైస్తవానికి పెను సవాల్

23 Nov, 09:33

సూప్ డబ్బా బొమ్మ ఖరీదు రూ.80 కోట్లా? వేలంలో కళ్లు చెదిరే రికార్డు.. ఇందులో అంత స్పెషాలిటీ ఏముంది?

23 Nov, 09:30

క్షణికావేశంలో సొంతింటి కలను బూడిదపాలు చేసిన భర్త.. భార్యపై కోపంతో నోట్లను తగలబెట్టిన వైనం!

23 Nov, 09:26

రాబోయే రోజుల్లో మరిన్ని సర్వర్ డౌన్లు తప్పవా? మైక్రోసాఫ్ట్ సంచలన హెచ్చరిక!

23 Nov, 09:17

అల్జీమర్స్‌పై కొత్త ఆశలు.. వయాగ్రా తరహా మాత్రతో సానుకూల ఫలితాలు!

23 Nov, 09:10

'వెల్ ప్లేడ్ ఎంఎస్'.. ధోనీ ఐపీఎల్‌ వీడ్కోలుపై స‌చిన్ భావోద్వేగ సందేశం

23 Nov, 08:58

ఆయిల్ ధరలు, ఇరాన్ దూకుడు.. అన్నింటికీ డెమోక్రాట్లే కారణం: ట్రంప్

23 Nov, 08:43

పల్నాడులో భారీ హింసకు ప్లాన్.. బాలకృష్ణ పీఏ శ్రీనివాసరావు అరెస్ట్.. మొత్తం 66 మందిపై కేసులు

23 Nov, 08:39

ఆ స‌మ‌యంలో నాతో పాటు ఏ ఒక్క‌రైనా నిలబ‌డి ఉంటే.. నేనే మ్యాచ్ ముగించే వాడిని: కెప్టెన్‌ తిల‌క్ వ‌ర్మ

23 Nov, 08:15

తొలి టెస్టుపై భారత్ పట్టు.. విజయం దిశగా టీమిండియా

23 Nov, 08:13

బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందా?.. విశ్లేషకులు ఏమంటున్నారంటే!

23 Nov, 08:06

ఫుడ్ డెలివరీ కోసం రోజూ 100 కి.మీ. సైకిల్ తొక్కిన యువకుడు.. ఇప్పుడు సీఏ

23 Nov, 07:59

విదేశీ ఉపాధిలో తెలంగాణ టామ్‌కామ్ రికార్డ్.. 15 వేల మందికి కొలువులు!

23 Nov, 07:57

రైల్వే స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండే రోజులే గడువు!

23 Nov, 07:40
..More Telugu News